క్యాన్సర్‌తో పోరాడుతుంటే అలా కామెంట్స్ చేస్తున్నారు.. ఎమోషనల్ అయిన నటి

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కుంటుంటే మరికొంతమంది మాత్రం క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడుతున్నారు. వారిలో కొంతమంది క్యాన్సర్ ను జయిస్తే.. మరోకొంతమంది మాత్రం ఇంకా దాని పై పోరాటం చేస్తున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతుంటే అలా కామెంట్స్ చేస్తున్నారు.. ఎమోషనల్ అయిన నటి
Actress

Updated on: Jan 25, 2025 | 11:38 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్స్ చాలా మంది క్యాసర్ బారిన పడ్డారు. కొంతంది ఆ మహమ్మారి నుంచి బయట పడ్డారు. అలాగే ఇంకొంతమంది క్యాన్సర్ తో పోరాడుతున్నారు.  క్యాన్సర్ బారిన పడటంతో చాలా మంది హీరోయిన్ అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ట్రీట్ మెంట్ లో భాగంగా చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యల్ను ఎదుర్కొంటుంటారు. కొంతమందికి జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది. తాజాగా ఓ హీరోయిన్ కు కూడా అలానే జరుగుతుంది. అయితే కొంతమంది మానవత్వం లేకుండా ఆమె పై ట్రోల్స్ చేయడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. క్యాన్సర్ తో పోరాడుతున్న తన పై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. ఎమోషనల్ అయ్యింది ఆమె.

బాలీవుడ్ బుల్లితెర నటి చవీ మిట్టల్‌ చాలా మందికి తెలిసిందే ఉంటుంది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది ఈ అమ్మడు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం ఈ నటి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. క్యాసర్ నుంచిబయట పడేందుకు ఈ భామ చికిత్స తీసుకుంటుంది. ఈ చికిత్సలో ఆమె తన జుట్టును కోల్పోతుంది. అయితే తనపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయ్యింది.

చవీ మిట్టల్‌ క్యాన్సర్ మహారమ్మారితో పొడుతూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. కాగా ఈ అమ్మడు తాజాగా మాట్లాడుతూ.. మానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో  నేను ఈ రోజు మరోసారి చూశాను. క్యాన్సర్ కారణంగా నేను  న ఆ జుట్టు కోల్పోతున్నా.. అది నాకు ఎంతో బాధను ఇస్తుంది. మీరేమో దాని పై నన్ను ట్రోల్ చేస్తున్నారు.  నేను 2022 నుంచి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నా.. దాని నుంచి నేను బయటపడటానికి న ఆకూ పదేళ్లు పట్ట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యింది. నా హార్మోన్‌ చికిత్స వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా..చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్‌, బరువు,మూడ్‌ స్వింగ్స్‌, తిమ్మిర్లు ఇలా చాలా ఉంటాయి. నేను ముందుగా క్యాన్సర్ నుంచి బయట పడాలి. నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నానో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది చవీ మిట్టల్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.