Chaavu Kaburu Challaga : ‘చావు కబురు చల్లగా’ నుంచి సెకండ్ సాంగ్.. అందమైన మెలోడీతో రాబోతున్న బస్తీ బాలరాజు..

|

Feb 21, 2021 | 1:58 PM

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలుచేసి ఆకట్టుకున్నాడు.

Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సెకండ్ సాంగ్.. అందమైన మెలోడీతో రాబోతున్న బస్తీ బాలరాజు..
Follow us on

Chaavu Kaburu Challaga movie : ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలుచేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత నానైనటించిన గ్యాంగ్లీడర్ సినిమాలోవిలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.తాజాగా చావుకబురు చల్లగాఅనే సినిమాతోప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. తాజాగాఈ సినిమా నుంచి అందమైన మెలోడీని రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రంలోని ‘కదిలే కాలాన్ని అడిగా..’ అనే గీతాన్ని ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. ఈమేరకుపోస్టర్స్ నురిలీజ్ చేసారు చిత్రయూనిట్.కాగా సినిమాను మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sundeep Kishan : ‘ఏ.1 ఎక్స్‌ప్రెస్’తో రానున్న సందీప్ కిషన్.. కారణాల వల్ల వాయిదా పడిన సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..