Charu Asopa: విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. నేనెప్పటికీ ఆ పని చేయను.. బుల్లితెర నటి..

విడాకులు తీసుకున్న తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉన్నామంటోంది. తమ కూతురి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని అన్నారు. హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది చారు అసోపా. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

Charu Asopa: విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. నేనెప్పటికీ ఆ పని చేయను.. బుల్లితెర నటి..
Charu Asopa
Follow us

|

Updated on: Jul 19, 2024 | 6:27 PM

కొంతకాలంగా ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ తెగ నడుస్తుంది. ఓవైపు ప్రేమ, పెళ్లి అంటూ కొందరు నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండగా.. మరికొందరు మాత్రం విడాకులు ప్రకటిస్తున్నారు. అయితే తాము విడిపోయిన తమ పిల్లలకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని అంటున్నారు. తాజాగా జూలై 18న టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా దంపతులు కూడా తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే విడిపోయినంత మాత్రాన బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదంటోంది బుల్లితెర నటి చారు అసోపా. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉన్నామంటోంది. తమ కూతురి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని అన్నారు. హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది చారు అసోపా. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

2019లో చారు అసోపా, రాజీవ్ వివాహం జరగ్గా.. వీరికి 2021లో జియానా అనే కూతురు జన్మించింది. కానీ ఆ మరుసటి ఏడాదే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నామంటూ ప్రకటించినా.. ఆ తర్వాత రాజీవ్, చారు కలుస్తూనే ఉన్నారు. అలాగే రాజీవ్ కుటుంబసభ్యులను కూడా చారు కలుస్తూనే ఉంది. ఇటీవలే వీరిద్దరు తమ కూతురితో కలిసి దుబాయ్ హాలీడే ట్రిప్పుకు వెళ్లారు. దీంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ రాగా.. తాజాగా తమ బంధం గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది చారు అసోపా.

“జియానా చాలా ఎంజాయ్ చేసింది. మేము కలిసే వెళ్లాము.. ఎందుకంటే రాజీవ్ జియానా తండ్రి. మేమంతా ఒక్కటే కుటుంబం. రాజీవ్ తల్లి సుస్మితా అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ మేము మా మధ్య బంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఇద్దరం విడిపోయినంత మాత్రాన సంబంధాలన్నీ ముగిసిపోవాలని లేదు. నేను జియానాను ఆమె కుటుంబం నుంచి ఎందుకు వేరు చేస్తాను.. ? నేను రాజీవ్ ఇప్పటికీ స్నేహితులుగానే కొనసాగుతున్నాం. అలాగే మేమిద్దరం కలిసి జియానా బాధ్యతను తీసుకున్నాం. వ్యక్తిగత సమస్యలు.. లేదా ప్రజలందరి మాటలు వినడం నేను మానేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Charu Asopa (@asopacharu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌