AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sampangi Movie: అయ్యా బాబోయ్.. అస్సలు ఊహించలేం.. సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి, నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి చిత్రాల్లో నటించింది. అయితే మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఈ బ్యూటీ కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

Sampangi Movie: అయ్యా బాబోయ్.. అస్సలు ఊహించలేం.. సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
Sampangi
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2024 | 3:50 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అందమైన ప్రేమకథ చిత్రాల్లో సంపంగి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చాలా మంది ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఇష్టంగా వింటుంటారు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హిందూ, ముస్లీం కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది.. ? ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ రెండు కుటుంబాల్లో ఏం జరిగింది ? అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా ఇది. సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథలో దీపక్ హీరోగా నటించగా.. కంచి కౌల్ కథానాయికగా నటించింది. ఇందులో చంద్రమోహన్, చలపతిరావు, సన, శివాజీ రాజా, రంగనాథ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది హీరోయిన్ కంచి కౌల్.

సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి, నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి చిత్రాల్లో నటించింది. అయితే మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఈ బ్యూటీ కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. సినిమాలతోపాటు పలు టెలివిజన్ షోలలో పాల్గొన్న కంచి కౌల్.. హిందీలో కొన్ని సినిమాలు చేసింది. 2005లో ఏక్ లడ్కీ అంజనీ సి టీవీ షాలో నటించింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంచి కౌల్ తెగ సందడి చేస్తుంది. తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా.. నెటిజన్స్ షాకవుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ అయిన సంపంగి హీరోయిన్ ను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన కంచి కౌల్.. ఇప్పుడు మరింత అందంగా మారిపోయి.. గ్లామర్ గా కనిపిస్తోంది. కంచికౌల్ భర్త కూడా నటుడు కావడం విశేషం. 2011లో టీవీ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. కంచికౌల్ భర్త షబ్బీర్ పలు సీరియల్స్ లో హీరోగా నటించాడు.

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!