Telangana: ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్..’ గుక్కెట్టి ఏడ్చిన పిల్లలు
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్ అయి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మాస్టారు మమ్మల్ని విడిచిపెట్టొద్దని స్కూల్ స్టూడెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డి పేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో 10 ఏళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల నుండి బదిలీ అయ్యాడు. పిల్లలతో మమేకంగా ఉన్న శ్రీనివాస్ పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు, విద్యార్థులు మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సారూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు చూసి అక్కడున్న టీచర్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 19, 2024 01:27 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

