Viral Video: బిల్డప్ చూసి అపర భక్తుడు అనుకునేరు.. ఆ తర్వాత అసలు సీన్
బోరివలి ఈస్ట్‌లోని రోడ్ నంబర్ 5లో ఉన్న విఠల్ ఆలయంలో వెండి కిరీటాన్ని దొంగిలించిన ఆరోపణపై కస్తూర్బా పోలీసులు ఘన్‌షైమ్ వర్మ (26)ను అరెస్టు చేశారు. ఓ బ్యాగ్‌తో వర్మ గర్భగుడిలోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 10న దొంగతనం జరగగా, అదే రోజు వర్మను అరెస్ట్ చేశారు.
దేవుళ్లను కూడా వదలడం లేదు దొంగలు. హుండీలో వేసిన కానుకులను ఖతం చేస్తున్నారు. దేవదేవతల ఆభరణాలను కూడా దొంగిలిస్తున్నారు. తాజాగా ముంబైలోని బోరివాలిలోని విఠల్ టెంపుల్‌లో ఓ దొంగ.. భక్తుడి మాదిరిగా ఆలయంలోకి ప్రవేశించి.. స్వామివారి వెండి కిరీటాన్ని అపహరించాడు. కిరీటాన్ని దొంగిలించే ముందు, క్షమాపణ కోరుతున్నట్లుగా ముకుళిత హస్తాలతో దేవుని విగ్రహాన్ని ప్రార్థించడం మీరు వీడియోలో చూడవచ్చు. అంతేకాదు.. అక్కడ సీసీ కెమెరా ఉన్న విషయాన్ని కూడా అతను గమనించాడు. అయినా వెనక్కి తగ్గలేదు. బోరివాలిలోని దత్తప్డా ప్రాంతంలోని విఠల్ మందిర్‌లో ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆపై కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నిందితుడికి బెయిల్ ఇచ్చారు.
వానికి రాజస్థాన్‌కు చెందిన వర్మ ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైకి వచ్చి.. ఏ పని దొరక్కపోవడంతో ప్రస్తుతం కాళీగానే ఉంటున్నాడు. అతను కండివలి వెస్ట్‌లో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అతడు దొంగతనం చేసిన కిరీటం.. 350 గ్రాముల బరువు ఉందని.. రూ.1500 విలువ చేస్తుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..