Andhra Pradesh: వామ్మో.. వీడు పోలీసులను చూస్తే సైకోలా మారతాడట.. పాపం ఆ హెడ్ కానిస్టేబుల్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాళింది పోలీసు యూనిఫామ్‌లను చూస్తే.. పేట్రోగిపోతాడు. చేతిలో ఏది ఉంటే.. దానితో దాడి చేస్తాడు. గతంలో కూడా అతను పోలీసులపై ఇలానే దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై వెనుక నుండి కర్రతో దాడి చేయడం కలకలం రేపింది. దాడి తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రాథమిక విచారణలో నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాల్తు కాళిందిగా గుర్తించారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. యూనిఫాంలో ఉన్న పోలీసులను చూడగానే.. అతను సైకోలా మారతాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ స్వామి దాస్‌గా తెలిసింది. ఆయన గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను వెంటనే గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత అతన్ని అధునాతన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

