Viral: యాదాద్రి జిల్లాలో వింత ఘటన.! మహిళకు తోకతో పుట్టిన శిశువు..
ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అలాంటి ఎన్నో సంఘటనలను తరచూ మనం చూస్తున్నాం. సాధారణంగా తోకలు జంతువులకు ఉంటాయి. మనుషులకు తోకలు ఉండటం ఎప్పుడైనా చూశారా? ఇటీవల తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు గతేడాది అక్టోబరులో తోక కలిగిన బాలుడు జన్మించాడు. ఆ వింత శిశువును చూసి వైద్యులు షాకయ్యారు.
ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అలాంటి ఎన్నో సంఘటనలను తరచూ మనం చూస్తున్నాం. సాధారణంగా తోకలు జంతువులకు ఉంటాయి. మనుషులకు తోకలు ఉండటం ఎప్పుడైనా చూశారా? ఇటీవల తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు గతేడాది అక్టోబరులో తోక కలిగిన బాలుడు జన్మించాడు. ఆ వింత శిశువును చూసి వైద్యులు షాకయ్యారు. ఆ బాలుడిని చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. రకరకాలుగా చర్చించుకున్నారు. పుట్టినప్పుడు చిన్నగానే ఉండటంతో తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. అయితే శిశువుకు 3 నెలల వయసు వచ్చేసరికి ఆ తోక 15 సెంటీమీటర్లకు పెరిగింది. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. వెంటనే హైదరబాద్ బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసి తోకను తొలగించారు.
ఈ ఏడాది జనవరి నెలలో బాబును తల్లిదండ్రులు బీబీ నగర్ ఎయిమ్స్‌కు తీసుకు వచ్చారు. చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పండా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు. గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్ కార్డ్ సరిగా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని, దీనిని వైద్య పరిభాషలో స్పినా బిఫిడగా పరిగణిస్తారని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ వైద్య బృందం రెండున్నర గంటలకు పైగా శ్రమించి ఆపరేషన్ చేసి తోకను చిన్నారి శరీరం నుంచి తొలగించారు. ఐదు రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితులను గమనించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే ఇలాంటి ఆపరేషన్స్ తర్వాత నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని వైద్యులు తెలిపారు. ఆరు నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు తాజాగా చిన్నారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో చిన్నారికి ఏ విధమైన ఇబ్బందులు ఉత్పన్నం కాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తోక తొలగిపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.