Aarti Agarwal: అలా చేయకుండా ఉండాల్సింది.. ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?

విక్టరీ వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే బారీ విజయాన్ని అందుకున్న ఆర్తికి.. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. చేతినిండా సినిమాలతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్‏గా మెప్పించడమే కాదు.. విలన్ గానూ అదరగొట్టింది.

Aarti Agarwal: అలా చేయకుండా ఉండాల్సింది.. ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
Aarti Agarwal
Follow us

|

Updated on: Jul 19, 2024 | 5:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా వెండితెరపై సందడి చేసింది ఆర్తి అగర్వాల్. అందమైన రూపం.. కలువల్లాంటి కన్నులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ ఎప్పటికీ సినీ ప్రియుల మనసులలో చెరగని అందమైన రూపం. విక్టరీ వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే బారీ విజయాన్ని అందుకున్న ఆర్తికి.. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. చేతినిండా సినిమాలతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్‏గా మెప్పించడమే కాదు.. విలన్ గానూ అదరగొట్టింది.

చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. అమే మానసిక ఒత్తిడిలో 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏడాది మెట్లపై నుంచి పడిపోయింది. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఇటు సినిమాల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి.

కొన్నాళ్లలకు రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదు. అప్పటికే బరువు ఎక్కువగా పెరగడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బరువు తగ్గేందుకు తీసుకున్న చిన్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది. స్థూలకాయం, శ్యాసకోస సమస్యలతో బాధపడిన ఆర్తి.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అందమైన రూపం.

ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..