బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.! అతడే ప్రభాస్ రాజు.
Anil Kumar
19 July 2024
బాక్సాఫీస్‌కు ఒక్కడే రాజు.. అతడే ప్రభాస్ రాజు అంటూ నెట్టింట కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
తాజాగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ.. 1000 కోట్ల గ్రాస్ .. 500 కోట్ల షేర్ సాధించడంతో ఆనందంలో మునిగిపోయారు.
ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్ చేసింది.. ఇప్పటివరకు చేయగలిగింది.. టాలీవుడ్ హీరోల్లో ఒక్క ప్రభాస్ మాత్రమే అంటూ..
ఇకపై ప్రభాస్ రికార్డ్స్ బీట్ చెయ్యాలంటే కష్టమే అంటూ.. సోషల్ మీడియాలో హై రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు.
ఇక ప్రభాస్ ఇప్పటికే బాహుబలి 2తో.. 500 కోట్ల షేర్ ను సాధించారు. ఇక కల్కి మూవీతో మరో సారి ఈ ఫీట్ చేసి..
కింగ్ ఆఫ్ టాలీవుడ్ అనే కామెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్లో వచ్చేలా చేసుకుంటున్నారు మన డార్లింగ్ ప్రభాస్.
సలార్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ సత్తా చాటాడు ప్రభాస్.
టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కింగ్ అఫ్ ఇండియన్ సినిమాగా డార్లింగ్ నిలబతాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి