Loan Recovery Agents Harassing: లోన్ కట్టమని రికవరీ ఏజెంట్స్ వేధిస్తున్నారా..? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్..!

ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరిగా మారింది. చాలా మంది ముందుగా వచ్చిన ఖర్చు నుంచి తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే దాన్ని కట్టడం నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో లోన్ రికవరీ చేసేందుకు ఆయా బ్యాంకులు లోన్ రికవరీ ఏజెంట్లను లోన్ తీసుకున్న వ్యక్తి వద్దకు పంపిస్తాయి. కానీ లోన్ రికవరీ చేసేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు సగటు రుణ గ్రహీతను ఇబ్బంది పెడతాయి. అయితే సాధారణంగా లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను వేధిస్తున్నారని తరచూ మనం మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు.

Loan Recovery Agents Harassing: లోన్ కట్టమని రికవరీ ఏజెంట్స్ వేధిస్తున్నారా..? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్..!
Loan Recovery Agents Harassing
Follow us

|

Updated on: Jul 19, 2024 | 5:00 PM

ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరిగా మారింది. చాలా మంది ముందుగా వచ్చిన ఖర్చు నుంచి తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే దాన్ని కట్టడం నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో లోన్ రికవరీ చేసేందుకు ఆయా బ్యాంకులు లోన్ రికవరీ ఏజెంట్లను లోన్ తీసుకున్న వ్యక్తి వద్దకు పంపిస్తాయి. కానీ లోన్ రికవరీ చేసేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు సగటు రుణ గ్రహీతను ఇబ్బంది పెడతాయి. అయితే సాధారణంగా లోన్ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను వేధిస్తున్నారని తరచూ మనం మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం బ్యాంకులు మరియు నాన్-బ్యాంకు రుణదాతలు తమ కస్టమర్ బేస్‌ను విస్తృతం చేసుకునేందుకు రుణాన్ని చాలా ఈజీగా అందిస్తున్నాయి. అయితే పెరుగుతున్న రుణాల నేపథ్యంలో నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా  రుణ నిబంధనలను కూడా సడలించింది. ఈ నేపథ్యంలో రుణం చెల్లించే విషయంలో రుణగ్రహీతలకు ఉండే చట్టపరమైన హక్కుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత కొంత కాలంలో రుణాల సులభంగా లభిస్తుండడంతో డిఫాల్ట్‌ల కూడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రుణ వసూలుకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అయితే రుణ ఎగవేతదారులను ఆర్థిక సంస్థల అనవసరమైన వేధింపులు, దుర్వినియోగ ప్రవర్తన నుంచి రక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ చట్టపరమైన హక్కులను అందించింది. ఒక రుణగ్రహీత డిఫాల్టర్‌గా మారడం వల్ల ఉద్యోగ నష్టం లేదా ఇతర ఆర్థిక సమస్యల కారణమై ఉండవచ్చు. ఆర్‌బీఐ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వేధింపుల సంఘటనలను నివారించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రత్యేకించి కోవిడ్ అనంతర ఆర్థిక సంస్థలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. రుణాలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రికవరీ ఏజెంట్లు కస్టమర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఉన్న చట్టపరమైన హక్కుల నిపుణులు సూచనలను చూద్దాం.

వేధింపుల రుజువును చూపడానికి రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని కాల్‌లు, ఇమెయిల్‌లు, మెసేజ్‌లను రికార్డ్ చేయాలి. ఈ సాక్ష్యాన్ని మీ రుణ అధికారికి లేదా రుణదాతకు సమర్పించాలి. వేధింపులు కొనసాగితే అన్ని వివరాలతో ఆర్‌బీఐకు మెయిల్ చేయడం ఉత్తమం. రుణాలు, అడ్వాన్సుల కోసం ఆర్‌బీఐకు సంబంధించిన సర్క్యులర్ మార్గదర్శక ఉల్లంఘనలు, రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి ఫిర్యాదులను కచ్చితంగా పరిష్కరిస్తుంది.  ముఖ్యంగా  కొన్ని ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్లను ఉపయోగించకుండా బ్యాంకులను ఆర్‌బీఐ నిషేధించే అవకాశం ఉంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే ఆర్‌బీఐ ఆ బ్యాంకులపై నిషేధాన్ని పొడిగించవచ్చు. రికవరీ ఏజెంట్ స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం ద్వారా లేదా మీ కార్యాలయంలో లేదా పరిసరాల్లో ఇబ్బందులకు గురిచేస్తే మీరు బ్యాంక్, ఏజెంట్‌పై పరువు నష్టం దావా వేయవచ్చు. రికవరీ ఏజెంట్లు అనుమతి లేకుండా మీ ఆస్తిలోకి ప్రవేశిస్తే మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. మరింత కఠినమైన చర్యలు తీసుకునే ముందు మీ మొదటిగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి. పోలీసులు సహాయం చేయకపోతే లేదా మీ ఫిర్యాదును నమోదు చేయకపోతే మీరు కోర్టు ఆశ్రయించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !