Nissan X Trail: ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. తక్కువ ధరలోనే మెంటల్ ఎక్కే ఫీచర్లు

తాజాగా ఫార్చ్యూనర్ కారుకు పోటీగా నిస్సాన్ మోటార్ ఇండియా ఎక్స్ ట్రైల్ పేరుతో జూలై 17న సరికొత్త కారును మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎక్స్-ట్రయిల్ ఫోర్ట్ జనరేషన్ సీబీయూతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. సీబీయూతో మాగ్నైట్ తర్వాత నిస్సాన్ కార్లలో ఎక్స్- ట్రైల్ రెండో కారుగా నిలిచింది. ఈ కారు భారత మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్లకు పోటీగా నిలుస్తుందని నిస్సాన్ ప్రతినిధులు చెబుతున్నారు.

Nissan X Trail: ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. తక్కువ ధరలోనే మెంటల్ ఎక్కే ఫీచర్లు
Nissan X Trail
Follow us

|

Updated on: Jul 19, 2024 | 4:30 PM

భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్. ఈ కారును ఎక్కువగా రాజకీయ నాయకులు అమితంగా ఇష్టపడతారు. మార్కెట్‌లో అధునాతన ఫీచర్లతో ఎన్ని కార్లు వచ్చినా ఈ కారు సేల్స్ మాత్రం పడలేదంటే ఫార్చ్యూనర్ క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఫార్చ్యూనర్ కారుకు పోటీగా నిస్సాన్ మోటార్ ఇండియా ఎక్స్ ట్రైల్ పేరుతో జూలై 17న సరికొత్త కారును మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎక్స్-ట్రయిల్ ఫోర్ట్ జనరేషన్ సీబీయూతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. సీబీయూతో మాగ్నైట్ తర్వాత నిస్సాన్ కార్లలో ఎక్స్- ట్రైల్ రెండో కారుగా నిలిచింది. ఈ కారు భారత మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్లకు పోటీగా నిలుస్తుందని నిస్సాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ ఎక్స్-ట్రయల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఇండియన్ మార్కెట్లో మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. సాలిడ్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌లో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 162 బీహెచ్‌పీ శక్తిని, 300 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. అలాగే 12వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, ఎక్స్-ట్రైల్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ చేయడానికి పుష్ బటన్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి వాటితో అధునాతంగా ఉంటుంది. 

నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌లో భద్రతా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఆటోమేటిక్ వైపర్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్ బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పరిమిత-స్లిప్ డిఫరెన్షియల్ ఫీచర్లు మరింత ఆకర్షిస్తాయి. ఎక్స్ -ట్రైల్ పొడవు 4,680 ఎంఎం, వెడల్పు 1,840 ఎంఎం, ఎత్తు 1,725 ఎంఎంగా ఉంది. అలాగే వీలే బేస్ 2,705 మి.మీగా ఉండగా ఈ కారు 7-సీటర్ ఎస్‌యూవీగా ఉంది. 5.5 మీటర్ల టర్నింగ్ రేడియస్, 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ రైడర్లను మరింత ఆకర్షిస్తుంది. ఎక్స్-ట్రైల్  సుమారు 40 లక్షల (ఎక్స్-షోరూమ్) మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే