వస్తువులకేకాదు.. చేసే పాపాలకూ 'సిన్ ట్యాక్స్' పన్ను కట్టాల్సిందే..!
16 July 2024
TV9 Telugu
TV9 Telugu
ఆదాయపు పన్ను, బంగారం పన్ను, అమ్మకపు పన్ను, GST.. ఇలా అనేక రకాల పన్నుల గురించి మీరిప్పటి వరకూ విని ఉంటారు. అయితే మనం చేసే పాపాలకు కూడా పన్ను విధిస్తారని మీకు తెలుసా?
TV9 Telugu
అవును.. పాపాలకు కూడా పన్ను ఉంటుంది. దీనినే సిన్ ట్యాక్స్ అంటారు. సమాజానికి హానికరంగా భావించే వస్తువులపై ఈ పాపపు పన్ను విధిస్తారు. పొగాకు, జూదం, మద్యం, సిగరెట్లు మొదలైన వాటిపై ఈ పన్ను విధిస్తారు
TV9 Telugu
సమాజానికి హానికరమైన కార్యకలాపాలు చేయకుండా నిరోధించడానికి పాపపు పన్ను విధిస్తారు. ఇటువంటి హానికరమైన ఉత్పత్తుల ధరలను పెంచడం ద్వారా, ఈ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా నిలిపివేయడం దీని లక్ష్యం
TV9 Telugu
పాపపు పన్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ పన్ను కింద అధిక మొత్తంలో సర్కార్‌కు చెల్లించవల్సి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వాలు పాపపు పన్ను ద్వారా కాస్త గట్టిగానే ఆదాయాన్ని పొందుతున్నాయి
TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వల ప్రధాన ఆదాయ వనరులలో సిన్ టాక్స్ ఒకటి. బ్రిటన్, స్వీడన్, కెనడా వంటి దేశాలు అనేక వస్తువులు, సేవలపై పాపపు పన్ను విధిస్తున్నాయి
TV9 Telugu
పొగాకు, మద్యం నుండి లాటరీలు, జూదం, జీవ ఇంధనాల వరకు అన్ని ఉత్పత్తులపై ఈ పన్నులు విధించడం ద్వారా ఆయా ప్రభుత్వాలు గణనీయమైన మొత్తంలో ఆర్జిస్తున్నాయి. 2013లో మెక్సికోలో పాపపు పన్ను పరిధిలో సోడా ట్యాక్స్ చేరింది
TV9 Telugu
భారతదేశంలో సిగరెట్లపై 52.7 శాతం పన్ను విధిస్తున్నారు. అంతేకాకుండా బీడీలపై 22 శాతం, పొగలేని పొగాకు ఉత్పత్తులపై 63 శాతం పన్ను విధిస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో భారతదేశంలో సిన్ టాక్స్ మరింత పెరిగే అవకాశం ఉంది
TV9 Telugu
నిజానికి, ప్రతి బడ్జెట్‌లో పాపపు పన్ను మొత్తం పెరుగుతూ ఉంటుంది. ధరల ఒత్తిడిలో ప్రజలు ఈ చెడు అలవాట్లను వదిలివేయాలనేది దీని ఉద్దేశం. పైగా ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీల నుంచి మరిన్ని పన్నులు వసూలు చేయడం కూడా సిన్ టాక్స్ లక్ష్యం