
తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు డైరెక్టర్స్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటూ ప్రశాంతమైన అనుభూతిని కలిగించే చిత్రాలను తెరకెక్కించే దర్శకులలో కృష్ణవంశి ఒకరు. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లరి పిల్లలుగా, అందమైన అమ్మాయిలుగా, డేరింగ్ అండ్ డ్యాషింగ్స్ హీరోయిన్లుగా చూపిస్తుంటారు. కృష్ణవంశి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో చందమామ ఒకటి. ఈ సినిమాకు ఇండస్టీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
అలాగే ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, నాగాబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే హీరోయిన్ కాజల్ స్టార్ డమ్ అందుకుంది. దీంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది. చందమామ సినిమాతో కాజల్ మాత్రమే కాదు.. మరో హీరోయిన్ సైతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. రౌడీ అమ్మాయిగా కనిపిస్తూనే అల్లరి పిల్లగా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. సింధు మీనన్. దివంగత హీరో శ్రీహరి నటించిన భద్రచలం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత త్రినేత్రం సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో దెయ్యంగా వెండితెరపై మాయ చేసింది.
ఆ తర్వాత తెలుగులో శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. చందమామ, వైశాలి చిత్రాల్లో నటించింది. చివరగా సిద్ధం అనే చిత్రంలో నటించింది. 2010లో డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుని యూకేలో స్థిరపడింది. ఆమెకు కూతురు, కుమారులు ఉన్నారు. తాజాగా సింధూ మీనన్ కూతురు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అందులో ఆమె కూతురు మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..