Ajith Kumar: అజిత్‌పై ప్రశంసల జల్లు.. గర్వంగా ఉందంటూ సెలబ్రిటీస్ కామెంట్స్

|

Jan 13, 2025 | 9:57 PM

దుబాయ్‌లో హోరాహోరీగా సాగిన 24 హెచ్ ఆర్ రేసింగ్ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. తొలి రేస్‌లోనే అజిత్ కుమార్ టీమ్ అసాధారణ విజయం సాధించి.. దేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు.

Ajith Kumar: అజిత్‌పై ప్రశంసల జల్లు.. గర్వంగా ఉందంటూ సెలబ్రిటీస్ కామెంట్స్
Celebrities Congratulate Actor Ajith
Follow us on

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ కార్ రేసింగ్‌లో సత్తా చాటాడు. దుబాయ్‌లో హోరాహోరీగా సాగిన 24 హెచ్  రేసింగ్ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కుమార్ టీమ్ తొలి రేసులోనే గొప్ప విజయాన్ని సాధించి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్‌, ఆయన టీమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. కార్ రేసుకు ముందు దుబాయ్‌లో రేస్ ట్రాక్‌పై అజిత్ కారు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. అదృష్టవశాత్తు అజిత్‌కు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయంకాలేదు. తన పేరిట ఏర్పాటు చేసిన అజిత్ టీమ్‌తో కలిసి బరిలోకి దిగిన అజిత్.. అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచాడు. ఐదు పదుల వయస్సులోనూ కార్ రేసింగ్‌లో అజిత్ తన సత్తా చాటడం విశేషం.

దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అజిత్, ఆయన టీమ్‌ని కొనియాడారు. సవాళ్లు అధిగమించి ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేయడం నిజంగా స్ఫూర్తిదాయకమని కామెంట్ చేశారు.

అజిత్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా అజిత్‌కు అభినందనలు తెలిపారు. నవ్వు సాధించావు.. లవ్ యూ అంటూ కొనియాడారు.

రజనీకాంత్ అభినందనలు

తొలి రేసులోనే అజిత్ టీమ్ గొప్ప విజయాన్ని సాధించిందని కమల్ హాసన్ కొనియాడారు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనడానికి మీరే ప్రత్యక్ష ఉదాహరణగా సమంత అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అజిత్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ హీరో మాధవన్ కొనియాడారు.

అజిత్‌కు కమల్ హాసన్ అభినందనలు

అజిత్‌కు మాధవన్ ప్రశంసలు