YouTuber Anvesh: అన్వేష్‌కు మూడింది.. ప్రముఖ నటి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు..

నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి, అదే పనిగా పెట్టుకుంటే ఏమీ కాదనుకుంటున్నారా? విదేశాల్లో కూర్చుని కారుకూతలు కూస్తే ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారా? ఇలాంటివాళ్లు ఒక ఒళ్లు దగ్గర పెట్టుకునే టైమొచ్చింది. పోలీస్‌ కేసులు ఇలాంటి వాళ్లను వదలవు. తాజాగా యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది.

YouTuber Anvesh: అన్వేష్‌కు మూడింది.. ప్రముఖ నటి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు..
Youtuber Anvesh

Updated on: Dec 31, 2025 | 1:19 PM

హిందూ దేవతలు, తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అతడ్ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయాలని.. యూట్యూబ్‌లో అన్ సబ్‌స్రైబ్ చేయాలని పిలుపునిస్తున్నారు. అందుకే తగ్గట్లుగానే అతడ్ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. అదే విధంగా అతడ్ని పోలీస్ కేసులు కూడా వెంటాడుతున్నాయి. తాజాగా అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దేవీ దేవతలను దూషించారంటూ పంజాగుట్ట PSలో ప్రముఖ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో
BNSలోని సెక్షన్‌ 352, 79, 299లతోపాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్‌ కింద అన్వేష్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్‌కి నోటీసులు పంపనున్నారు.  అన్వేష్ వివాదాస్పద కామెంట్స్‌పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  అతడిని భారత్‌కు రప్పించాలని హిందూసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కంటెంట్ క్రియేటర్‌ని గొప్పవాడిని చేసింది ప్రేక్షకుడే. అలాగే అతని పతనానికి కారణమయ్యేది కూడా ప్రేక్షకుడే. అందుకే వీడి పైత్యం చూసిన జనం.. లక్షల్లో అన్‌సబ్‌స్క్రయిబ్ చేయడం ప్రారంభించారు. గత రెండ్రోజుల్లో లక్షలకు పైగా జనం అతని మాటల్ని, చేష్టల్ని ఛీదరించుకున్నారు. అందుకే తత్వం బోధపడి..తెలుగు ప్రేక్షకులకు సారీ చెబుతున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం. ఇప్పుడు తానూ హిందువునే నంటూ చిలకపలుకులు అందుకుందీ చిలక. అంతేకాదు టెంపుల్ విజిట్ చేసిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాడు. అయినా సరే అన్వేష్‌కు బుద్ది చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్‌కాట్ అన్వేష్ హ్యాష్‌ట్యాగ్ ట్రోల్ అవుతోంది. ఇన్నాళ్లూ అతగాడి కంపు భరించింది చాలు, అన్ ఫాలో కండి, రిపోర్టు చేయండి…అంటూ సోషల్ మీడియా అన్వేష్‌కు వ్యతిరేకంగా హోరెత్తిపోతోంది.