ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించినవారంతా ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. శ్రీవిద్య, కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా వంటి తారలు ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఓ చైల్డ్ ఆర్టిస్టు గురించి తెలుసుకుందాం. తెలుగులో అనేక సినిమాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించాడు. తన నటనతో అలరించాడు. జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి జంటగా నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించాడు. అమాయకమైన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అనుకుంటున్నారా ? అతడే ఆనంద్ హర్షవర్దన్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ వెంకటేశ్ నటించిన సూర్యవంశం సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన సూర్యవంశం సినిమాలో వెంకీ తనయుడిగా నటించాడు ఆనంద్ హర్షవర్దన్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆనంద్ హర్షవర్దన్ ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పిబీ శ్రీనివాస్ మనవడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం సినిమాలో వాల్మికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు. అలాగే వెంకటేశ్ నటించిన ప్రేమించుకుందాం రా మూవీ వెంకీ మేనల్లుడిగా కనిపించాడు.
తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో అలరించాడు. పెళ్లి పీటలు, ప్రేయసి రావే, తిరుమల తిరుపతి వెంకటేశ, మనసంతా నువ్వే, ఇంద్ర, తొలి చూపులోనే, నేనున్నా్ను వంటి చిత్రాల్లో నటించాడు. హిందీలో రీమేక్ చేసిన సూర్యవంశం సినిమాలో అమితాబ్ కొడుకుగా కనిపించాడు. అలాగే కన్నడలోనూ ఓ సినిమా చేశాడు. బాలనటుడిగా దాదాపు 25 సినిమాల్లో నటించిన ఆనంద్.. ఆ తర్వాత చదువు దృష్ట్య సినిమాలకు దూరమయ్యాడు. హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసిన ఆనంద్…తిరిగి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం హీరోగా ఆన్ ది వే అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నిదురించు జహాపన అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆనంద్ తన సినిమా పోస్టులు చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.