Sontham Movie: బాబోయ్.. ఈ అమ్మాయి సొంతం సినిమా హీరోయినా ?.. ఈ రేంజ్‏లో మారిందేంటీ..

|

Apr 30, 2024 | 8:02 AM

అలాంటి వారిలో హీరోయిన్ నేహా పెండ్సే ఒకరు. ఈ అమ్మాడి పేరు చెబితే తెలుగు అడియన్స్ అసలు గుర్తుపట్టలేరు. కానీ సొంతం సినిమా బ్యూటీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ హీరోయ ఆర్యన్ రాజేశ్, నిమత జంటగా నటించిన సినిమా సొంతం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది నేహా. ఇది ఆమెకు తొలి చిత్రం.

Sontham Movie: బాబోయ్.. ఈ అమ్మాయి సొంతం సినిమా హీరోయినా ?.. ఈ రేంజ్‏లో మారిందేంటీ..
Nehha Pendse
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్స్ అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించారు. కానీ అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొందరు ఒకటి రెండు చిత్రాలతో మెప్పించినా.. మరికొందరు మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక చాలాకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా పెండ్సే ఒకరు. ఈ అమ్మాడి పేరు చెబితే తెలుగు అడియన్స్ అసలు గుర్తుపట్టలేరు. కానీ సొంతం సినిమా బ్యూటీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ హీరోయ ఆర్యన్ రాజేశ్, నిమత జంటగా నటించిన సినిమా సొంతం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది నేహా. ఇది ఆమెకు తొలి చిత్రం.

ఈ సినిమాలో సునీల్, నేహాకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అమాయకమైన నటనతో సునీల్ ను ప్యూన్ అంటూ చేసే కామెంట్స్ ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. సొంతం తర్వాత గోల్ మాల్, వీధి రౌడీ చిత్రాలతోపాటు మరో రెండు సినిమాల్లో కనిపించింది. అయితే ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో నేహాకు తెలుగులో గుర్తింపు రాలేదు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.

హిందీ, మరాఠీలో పలు చిత్రాల్లో నటించిన నేహా.. చివరగా 2020లో ఓ హిందీ ప్రాజెక్ట్ చేసింది. సినిమాలకు దూరంగా ఉన్న నేహా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టిటం వైరలవుతున్నాయి. నాలుగుపదుల వయసులోనూ స్టన్నింగ్ గ్లామర్ లుక్స్ తో నెట్టింట మాయ చేస్తుంది నేహా. 2020 జనవరి 5న తన ప్రియుడు శార్దుల్ సింగ్ ను పెళ్లి చేసుకుంది నేహా. వివాహం తర్వాత కూడా సీరియల్స్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.