
జక్కన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా.. సినిమాకు బోలెడంత టైం తీసుకున్నా.. అది రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. టాలీవుడ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిదే. ఒక్క ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచమంతా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో మళ్లీ వరల్డ్‌వైడ్ అటెన్షన్‌ను తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి. అలాంటి జక్కన్న సినిమాల్లో ఒక్క పాత్ర వచ్చినా చాలు.. స్క్రిప్ట్ చూడకుండానే ఓకే చెప్పేసే నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటిది ఓ హీరో.. దర్శకధీరుడు రాజమౌళికి నో చెప్పాడు. ఆయన చెప్పిన కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. కట్ చేస్తే.. అదే కథను మరో హీరోతో తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు రాజమౌళి. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. రెబల్ స్టార్ ప్రభాస్.
ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఏంటంటే.? ‘స్టూడెంట్ నెంబర్ 1’. ప్రభాస్ వద్దన్నా ఈ కథను ఎన్టీఆర్‌తో తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు రాజమౌళి. మొదటగా రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ 1’ కథను ప్రభాస్‌కు వినిపించారట. ఆ కథ ప్రభాస్‌కు నచ్చకపోవడంతో డార్లింగ్ రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కాగా, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించాయి.