Guess who: కసరత్తులతో కష్టపడుతున్న ఈ కన్యాకుమారి ఎవరో గుర్తుపట్టారా..

|

Apr 08, 2022 | 10:52 AM

హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే చాలా కష్టం.. అందం అభినయం తోపాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం.. అందుకోసం ముద్దుగుమ్మ జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు

Guess who: కసరత్తులతో కష్టపడుతున్న ఈ కన్యాకుమారి ఎవరో గుర్తుపట్టారా..
Pic
Follow us on

హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే చాలా కష్టం.. అందం అభినయంతోపాటు ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం.. అందుకోసం ముద్దుగుమ్మ జిమ్‌లో చమట్లు చిందిస్తూ ఉంటారు. బాబ్లీ లుక్ ఎదో ఒక్క సినిమాలో చూడటానికి బాగుంటుంది కానీ అన్ని సినిమాల్లో అదే లుక్ అంటే సెట్ అవ్వదు.. దాంతో సన్నజాజిలా మారడానికి అందాల భామలు పడే కష్టాలు అన్ని ఇన్ని  కావు.. ఇష్టమొచ్చినవి తినకుండా నోరును కట్టేసుకోవాలి.. ఒకవేళ తిని ఫ్యాట్ పెరిగితే జిమ్ లో కష్టపడాలి.. పై ఫొటోలో కసరత్తులు చేస్తూ చమట్లు చిందిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మొన్నటి వరకు బొద్దుగా కనిపించిన ఈ సుందరి. ఇప్పుడు ఇలా సన్నజాజిలా మారిపోయింది. ఈ అమ్మడిని కనిపెట్టడం అంత కష్టమైన పని కాదేమో.. ఎవరో తెలిసిపోయిందా..

పిట్ నెస్ కోసం పట్లు పడుతున్న ఈ చిన్నది ఎవరో కాదు అందాల భామ రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే నటన ఈ అమ్మడి సొంతం. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాశి.. ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలివుడ్ లో దాదాపు యంగ్ హీరోలందరితో జత కట్టింది ఈ భామ. తెలుగుతో పాటు ఇప్పుడు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ సినిమా కూడా చేసింది. ఇక తెలుగు విషయానికొస్తే ప్రస్తుతం గోపిచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ సినిమా చేస్తుంది. అలాగే నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తుంది రాశి ఖన్నా.మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్