
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించిన తొలి చిత్రం అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తనకంటే 20 ఏళ్లు పెద్ద హీరోతో ఆమె ఫస్ట్ మూవీ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే బేబీ సారా అర్జున్. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. దీంతో తన సోషల్ మీడియా ఖాతాలలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది సారా. ముంబైలో జన్మించిన సారా.. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తుంది. 2011లో విడుదలైన ‘404’ చిత్రంతో బాలనటిగా హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
అదే ఏడాది విక్రమ్ చియాన్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో విక్రమ్ కూతురిగా కనిపించింది. క్లైమాక్స్ లో సారా, విక్రమ్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సారా విస్తృత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 2013లో ఆమె ‘చిత్తిరై నిలచ్ చోరు’ చిత్రంలో నటించింది. తరువాత, ఆమె హిందీ చిత్రం ‘జై హో’లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించిన సారా.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
2022లో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ టీనేజ్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సరసన ధురందర్ అనే సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుుంటుంది. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 20 సంవత్సరాలు కాగా.. రణవీర్ వయసు 40 ఏళ్లు. ఇప్పుడిప్పుడే నెట్టింట యాక్టివ్ అవుతుంది సారా అర్జున్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?