సెలబ్రిటీలు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు అనుకోండి. వారికి సంబంధించిన అన్ని డీటేల్స్ తెలుసుకునేందుకు నెటిజన్స్ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ క్రమంలో వారి చిన్నానాటి ఫోటోలు, కాలేజ్ డేస్ ఫోటోలు… వైరల్ అవుతుంటాయి. అలా ప్రజంట్ ఓ సౌత్ ఇండియన్ యాక్టర్ త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ఎవరో అపరిచితుడిగా, శివపుత్రుడుగా… తెలుగు సినీ ప్రేక్షకుల మదిని దోచిన తమిళ హీరో. బుధవారం హీరో చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమా సెట్‌లోనే ప్రమాదానికి గురయ్యాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నిర్మిస్తోన్న తంగలాన్ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉండగా… సినిమా సెట్‌లోనే విక్రమ్ ప్రమాదానికి గురవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. ఆయనకు పక్కటెముక విరిగినట్టు వైద్యులు వెల్లడించడంతో తమిళ సినీపరిశ్రమలో అవాక్కయ్యింది.
తంగలాన్ సినిమాతో త్వరలోనే జనం ముందుకు రాబోతున్నాడు తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. కోలార్ గోల్డ్‌మైన్స్‌లో పనిచేసే గనికార్మికుల జీవన కథాంశమే ఇతివృత్తంగా ఈసినిమాని తెరకెక్కిస్తున్నారు. కోలార్ గనికార్మికుడైన ఓ దళితుడి ఏడు దశాబ్దాల చరితను సినిమాగా తీస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తంగలాన్ సినిమాలో విక్రమ్ హీరోగా…పార్వతి, మాళవిక మోహనన్‌లు హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో హీరో జీవితం…గనిపనిమనిషి విక్రమ్ ప్రత్యేక వేషధారణ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ చేంజోవర్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది.
57 ఏళ్ళ వయస్సులో కోలార్ గోల్డ్ మైన్స్‌లో తీసిన ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ చాలా కష్టపడ్డారు. అడవులు…నీళ్ళూ…రాతిదారుల్లో చిత్రనిర్మాణం చేశారు. మేకింగ్ వీడియో చూసి ఈ సినిమాలో విక్రమ్ లుక్ భయపెడుతోందంటున్నారు. ఈ అనూహ్య పరిణామం చిత్ర బృందాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. అయితే విక్రమ్‌ని ప్రమాదాలు వెంటాడుతున్నాయన్న సందేహం సర్వత్రా వినిపిస్తోంది. జాన్ కెన్నడీ వినోద్ రాజ్ విక్రమ్ అసలు పేరు. విక్రమ్ అతిచిన్న వయస్సులోనే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు జరిగిన ప్రమాదంలోనే విక్రమ్ కాలు తీసేయాలని సూచించినా విక్రమ్ తల్లి సంతకం పెట్టకపోవడంతో అది జరగలేదు. అనేక ఆపరేషన్ల తరువాత విక్రమ్ కోలుకున్నాడు. పాత్ర కోసం ఏమైనా చేస్తాడు విక్రమ్. పెను ప్రమాదమని తెలిసినా ముందుకు వెళ్తారు. సినిమా అంటే ఆయనకు అంత పిచ్చి. ఐ సినిమా కోసం పూర్తిగా బక్కచిక్కిపోయి.. కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇలాంటి ప్రయోగాలు ఆయన చాలా చేశారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో మెరిసిన విక్రమ్.. ఆ సినిమా పార్ట్ 2 ప్రమోషన్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు. తాజా గాయం నుంచి విక్రమ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రజంట్ మీరు పైన చూస్తున్న విక్రమ్ టీనేజ్ ఫోటో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..