Tollywood Actress: ప్రజంట్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఓ నటే… ఈ ఫోటోలోని చిన్నారి.. ఎవరో గుర్తించగలరా…?

|

Sep 16, 2021 | 2:26 PM

టాలీవుడ్‌లో టాప్ యాంకర్ కమ్ నటి ఎవరంటే.. మీకు ఎవరు గుర్తుకువస్తారు. వారే ఈ ఫోటోలో ఉన్నారు. అయ్యో ఇంకా గుర్తుకురాలేదా..? అయితే ఫుల్ స్టోరీలోకి వెళ్లండి.

Tollywood Actress: ప్రజంట్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఓ నటే... ఈ ఫోటోలోని చిన్నారి.. ఎవరో గుర్తించగలరా...?
Anasuya
Follow us on

టాలీవుడ్‌లో టాప్ యాంకర్ ఎవరంటే గుక్క తిప్పుకోకుండా సుమ అని చెప్పేస్తారు. టాలీవుడ్‌లో టాప్ యాంకర్ కమ్ నటి ఎవరంటే.. కనిపించే ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనసూయ. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఇక ఆమె యాంకర్‌గా ఒకవైపు చక్రం తిప్పుతూనే మరోవైపు నటిగా క్రేజీ ఛాన్సులు పట్టేస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భామకు ఉన్న ఫాలోయింగ్ చూసి హీరోయిన్స్ కూడా అసూయ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనసూయ అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్‌ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆచార్య, కిలాడీ, పుష్ప, రంగమార్తాండ సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. వీటిలో ముఖ్యంగా రంగమార్తాండలో ఆమె పాత్ర నెక్ట్స్ లెవర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్ర పోషించనుందట.  మరికొన్ని సబ్జెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అటు ఫ్యామిలీ లైఫ్ పరంగా, ఇటు ప్రొఫెషినల్ లైఫ్ పరంగా అను ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. కాగా ఈ స్టార్ యాంకర్ చిన్నప్పుడు కూడా పాలబుగ్గలతో ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. అనసూయ గతంలో షేర్ చేసిన తన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ఫోటోలో ఉంది అనసూయే అని చాలామంది గుర్తించలేకపోతున్నారు.

కాగా అనసూయ తాజాగా మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది. మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మోహన్ లాల్  హీరోగా నటిస్తోన్న సినిమాలో అనూని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ నటి కెరీర్ ఇప్పుడు ఫుల్ పీక్స్‌లో ఉందని అర్థమవుతోంది.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతడి అరెస్టుకు రంగం సిద్దం..!

Cyber Crime Police: పోర్న్ చూస్తున్నారా..? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే.