Tollywood: పద్దతిగా కనిపిస్తున్న అమ్మాయిల్లో ఉన్న స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా ..? అమ్మగా ప్రమోషన్ పొందిన తరగని వయ్యారం..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తారల అరుదైన ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీమణుల కాలేజ్ డేస్, మోడలింగ్ డేస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక తమ అభిమాన హీరోయిన్లను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి ఎక్కువగానే చూపిస్తున్నారు. పైన ఫోటోలో చీరకట్టులో ఎంతో పద్దతిగా నలుగురు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.

Tollywood: పద్దతిగా కనిపిస్తున్న అమ్మాయిల్లో ఉన్న స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా ..? అమ్మగా ప్రమోషన్ పొందిన తరగని వయ్యారం..
Actress

Updated on: May 11, 2024 | 8:09 PM

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తారల అరుదైన ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీమణుల కాలేజ్ డేస్, మోడలింగ్ డేస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక తమ అభిమాన హీరోయిన్లను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి ఎక్కువగానే చూపిస్తున్నారు. పైన ఫోటోలో చీరకట్టులో ఎంతో పద్దతిగా నలుగురు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అమ్మగా ప్రమోషన్ పొందినా కుర్రహీరోయిన్లకు సైతం గట్టి పోటీనిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ? ఆ ఫోటోలో ఎడమ వైపు నుంచి మూడో అమ్మాయి.. ఎడమవైపు నుంచి రెండో అమ్మాయి ఒకప్పటి తెలుగు కుర్రాళ్ల దిల్ క్రష్ శ్రియా శరణ్.

చిత్రం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించింది. నటిగా బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.

2018లో రష్యన్ కు చెందిన ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది. వీరికి 2021లో పాప జన్మించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ మరోసారి నటిగా అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో శ్రియా చేసే అందాల రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.