Tollywood: ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్.. ఎవరో గుర్తుపట్టగలరా ..?

|

Apr 26, 2024 | 9:47 AM

అందం, అభినయం కలగసిన అందాల ముద్దుగుమ్మ. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుగుణాల సుందరి. ముసుగు చాటున దాగిన ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. గత ఏడాదిగా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది ఈ మలయాళీ కుట్టి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుతెలుసా ?..

Tollywood: ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్.. ఎవరో గుర్తుపట్టగలరా ..?
Actress
Follow us on

అందం, అభినయం కలగసిన అందాల ముద్దుగుమ్మ. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుగుణాల సుందరి. ముసుగు చాటున దాగిన ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. గత ఏడాదిగా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది ఈ మలయాళీ కుట్టి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుతెలుసా ?.. తనే కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ అమ్మడు ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. అఆ సినిమాతో తెలుగు తెరకు పరచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో అనేక చిత్రాల్లో కనిపించిన అనుపమ.. ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో రూటు మార్చింది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ రోల్స్ చేసిన అనుపమ.. ఇప్పుడు గ్లామరస్ బ్యూటీగా బిగ్ స్క్రీన్ పై రచ్చ చేసింది. లిల్లీ పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేసింది. అలాగే రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ అంటూ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది.

కానీ లిల్లీ పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన అనుపమ.. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ స్ట్రాట్ చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. చాలా కాలం తర్వాత మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫర్ కేరళ మూవీలో నటిస్తుంది. అలాగే తెలుగులో సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు అనుపమ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో గ్లోరియస్ ఫేస్ తో కనిపిస్తుంది. పసుపు కలర్ చున్నీతో ముఖాన్ని కప్పుకుని మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఆమెకు ముక్కుపుడక మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో ఈ మూవీలో అనుపమ బంజారా లుక్ లో కనిపించనుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అనుపమ పరమేశ్వరన్, ప్రవీణ్ కండ్రేగుల కాంబోలో వస్తున్న ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ వీడియోను ఈరోజు సాయంత్రం 4.56 నిమిషాలకు హీరోయిన్ సమంత రిలీజ్ చేయనుంది. లేడీ మల్టీస్టా్రర్ గా వస్తున్న ఈ మూవీలో అనుపమతో పాటు మలయాళం హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ నటిస్తుంది. జయ జయ జయహే, హృదయం సినిమాతో ఫేమస్ అయ్యింది దర్శనా. ఇప్పుడు అనుపమతో కలిసి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.