South Indian Movies Icon: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఐకాన్‌గా అల్లు అర్జున్.. స్వాగ్ ఇంపాక్ట్ అంటే ఇది..

ఎవరైనా వారి వారి కెరీర్లో ఎంత శాతం పెరుగుదల చూపిస్తారు. మా అంటే.. మాక్స్ 100 శాతం మాత్రమే పెరుగుదల చూపిస్తారు. కాని ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన ఫిల్మ్ కెరీర్‌లో..

South Indian Movies Icon: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఐకాన్‌గా అల్లు అర్జున్.. స్వాగ్ ఇంపాక్ట్ అంటే ఇది..
Bunny As South Indian Movies Icon

Updated on: Jul 18, 2022 | 8:23 AM

ఎవరైనా వారి వారి కెరీర్లో ఎంత శాతం పెరుగుదల చూపిస్తారు. మా అంటే.. మాక్స్ 100 శాతం మాత్రమే పెరుగుదల చూపిస్తారు. కాని ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన ఫిల్మ్ కెరీర్‌లో ఏకంగా 200 పర్సెంట్ పెరుగుదల చూపించారని అంటున్నారు బీ టౌన్‌ మీడియా పర్సన్స్‌ . అనడమే కాదు.. తాజాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెర్టినిటీ మీద.. పాన్ ఇండియన్ సినిమాల పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ ముఖ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ను చూపించారు.

అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్ వారసుడిగా.. మెగా స్టార్ చిరంజీవి అల్లుడిగా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆ తరువాత స్టెప్‌ బై స్టెప్‌ తన క్రేజీను, ఇమేజ్‌ ను పెంచుకుంటూ వచ్చారు. స్టైలిష్ స్టార్ గా యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే.. ఐకాన్ స్టార్గా.. పాన్ ఇండియన్ స్టార్ గా తనను తాను ప్రూఫ్ చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన పుష్ఫ సినిమాతో.. పాన్ ఇండియా రేంజ్‌ లో బజ్‌ చేశారు. చేసిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ తోనే.. తన స్వాగ్ ఇంపాక్ట్ ఏంటో…. బాలీవుడ్‌ కు చూపించేశారు. తగ్గేదే లే అంటూ.. తన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ ను రఫ్పాడించారు.

ఇక తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ ముందు సౌత్‌ ఇండియన్‌ సినిమాల జోరును.. వారి పాన్ ఇండియన్ సినిమాల తీరును… ఆ సినిమాల్లోని హీరోలు చూపించే స్వాగ్‌ను అడ్రస్ చేస్తూ.. ఓ ఆర్టికల్‌ను పబ్లిష్ చేసింది ఇండియన్ టుడే మ్యాగజీన్. ఆ ఆర్టికల్లో పాన్ ఇండియన్ కేంద్రాలుగా.. వర్సటైల్ ఫిల్మ్ డెవలపర్స్‌గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ట్రాన్స్‌ ఫాం అవుతుందని కోడ్‌ చేశారు. అయితే ఈ ఆర్టికల్‌కు ముఖ చిత్రంగా అల్లు అర్జున్ పేరును ఎంచుకుంది ఇండియా టుడే. ఎంచుకోవడమే కాదు అల్లు అర్జున్‌ ఫోటోతో పాటు.. ‘ది సౌత్ స్వాగ్’ అనే టైటిల్ కూడా ఇచ్చింది.