
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన సినీ కెరీర్, దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన సినీ జీవితంలో కృష్ణవంశీ పాత్రను, ఆయన ద్వారా తనకు లభించిన అవకాశాలను వివరించాడు. అలాగే రవితేజతో తన స్నేహం, వారిద్దరి కెరీర్ ఎదుగుదలపై కూడా కీలక కామెంట్స్ చేశాడు. రవితేజది, తనది ఒకేసారి నటులుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టామని అన్నాడు. రవితేజ ఇప్పుడు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తుండటం తనకు హ్యాపీ అని.. తాను ఎప్పుడూ కూడా హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి రాలేదని బ్రహ్మాజీ అన్నాడు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా సమయంలో రవితేజ నటుడిగా ప్రయత్నాలు మానేసి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని బ్రహ్మాజీ తెలిపాడు. ఆ సమయంలో రవితేజ అనిల్ కపూర్ నడకను అనుకరించే మిమిక్రీ బాగా చేసేవాడని.. ఒకసారి నాగార్జున, టబుల ముందు రవితేజను మిమిక్రీ చేయమని తాను ప్రోత్సహించానని తెలిపాడు. రవితేజ స్కిల్స్ చూసి దర్శకుడు కృష్ణవంశీ.. అతనికి కామెడీ పాత్రను రాశారని, అది రవితేజ కెరీర్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్లిందని బ్రహ్మాజీ పేర్కొన్నాడు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
ఇక కృష్ణవంశీ దర్శకుడిగా మారకముందు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోజులలో.. బ్రహ్మాజీ తన తండ్రి పంపిన డబ్బుతో పాండీ బజార్‌లోని ఒక చిన్న హోటల్‌లో మంత్లీ టికెట్ కలిగి ఉండేవాడు. ఒకరోజు రాత్రి 8:30 గంటల సమయంలో కృష్ణవంశీని భోజనానికి ఆహ్వానించాను. అప్పుడు కృష్ణవంశీ రెండు రోజుల నుంచి భోజనం చేయలేదని, ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడని తర్వాత తెలిసిందన్నాడు బ్రహ్మాజీ. ఇక తాను చేసిన ఈ చిన్న సాయాన్ని కృష్ణవంశీ ఎప్పటికీ మర్చిపోలేదని, అదే తనకు గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం లాంటి పెద్ద సినిమాలకు అవకాశం కల్పించిందని బ్రహ్మాజీ వెల్లడించాడు. నిన్నే పెళ్లాడతా షూటింగ్‌లో కృష్ణవంశీ ‘ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా’ అని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకున్నారని బ్రహ్మాజీ గుర్తు చేసుకున్నాడు.
కృష్ణవంశీకి రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. ‘దేవుడు ఇచ్చినా కూడా రుణం తీర్చుకోవాలని అంత చేసాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్’ అని బ్రహ్మాజీ అన్నాడు. కృష్ణవంశీ తనకు గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం లాంటి సినిమాలలో అవకాశాలు ఇచ్చారని.. అదే ఆయన నాకిచ్చిన పెద్ద గిఫ్ట్స్ అని అన్నాడు. క్యారెక్టర్ సూట్ అయితే కృష్ణవంశీ ఇప్పటికీ తనకు అవకాశం ఇస్తారని బ్రహ్మాజీ తెలిపాడు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..