బర్నింగ్ డైరెక్టర్ తో బన్నీ సినిమా చేయబోతున్నాడా..? ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్..

డైరెక్టర్‌ భాస్కర్‌.. ఈయనెవరో తెలుసా.. తెలియదు కదూ.. బొమ్మరిల్లు భాస్కర్‌.. ఓ ఈ డైరెక్టరా అని ఇప్పుడనుకుంటున్నారు కదూ..! ఎస్ ఒకప్పటి క్రేజీ డైరెక్టర్‌..

  • Rajeev Rayala
  • Publish Date - 3:09 pm, Sun, 28 February 21
బర్నింగ్ డైరెక్టర్ తో బన్నీ సినిమా చేయబోతున్నాడా..? ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్..

Allu Arjun : డైరెక్టర్‌ భాస్కర్‌.. ఈయనెవరో తెలుసా.. తెలియదు కదూ.. బొమ్మరిల్లు భాస్కర్‌.. ఓ ఈ డైరెక్టరా అని ఇప్పుడనుకుంటున్నారు కదూ..! ఎస్ ఒకప్పటి క్రేజీ డైరెక్టర్‌.. ఇప్పటి బర్నింగ్ డైరెక్టర్‌ మరో స్టార్‌ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు తెలుసా..?

సిసింద్రీ అఖిల్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అంటూ.. ప్రజెంట్‌ సినిమా చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్‌ బన్నీతో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడట. భాస్కర్ తలచుకుంటే మరోసారి బొమ్మరిల్లు వంటి ఫ్యామిలీ లవ్‌స్టోరీని అందించగలరని, గట్టిగా నమ్ముతున్న అరవింద్‌.. బాస్కర్, బన్ని కాంబోలో ఓ మంచి ఫ్యామిలీ సినిమా పడితే బాగుటుందని ఫీల్ అవుతున్నాడట.

అయితే ఈ సినిమా అఖిల్‌ సక్సెస్ మీద ఆధారపడి ఉందట.. అదేంటని అనుకుంటున్నారా.. అవును బొమ్మరిల్లు భాస్కర్‌, అఖిల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమా సక్సస్ అయితే.. అరవింద్‌ ముందడు వేసి బన్నీ, భాస్కర్‌ కాంబినేషన్ను సెట్ చేస్తాడట. లేదంటే.. లేదంతే అట..! అంటే ఈ లెక్కన అఖల్‌ సక్సెస్‌ మీదే బొమ్మరిల్లు భాస్కర్‌, బన్నీ నెక్ట్స్ సినిమా ఆధారపడి ఉంది మరి..! ఇక గీతాఆర్ట్‌ బ్యానర్‌లో వస్తున్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rakul Preet Singh: ‘అవే సినిమాలు రిపీట్‌ చేస్తే.. ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్‌..

Balakrishan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో.. త్వరలో మాటల మాంత్రికుడి మాయలో నటసింహం ..