Asha Bhosle: ఆమె గొంతులో ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఆశాజీ పాడిన ఎవర్ గ్రీన్ తెలుగు సాంగ్స్ ఇవే.. మీరు విన్నారా?

ఆశా భోంస్లే హిందీ, తెలుగు, కన్నడతో పాటు వివిధ భారతీయ భాషల్లో వేల సంఖ్యలో పాటలు ఆలపించారు. వీటిలో ఎక్కువగా హిందీ సాంగ్స్ ఉన్నప్పటికీ తెలుగులో ఆశా జీ పాడిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ మధురమైన పాటలేంటో ఒక లుక్కేద్దాం రండి.

Asha Bhosle: ఆమె గొంతులో ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఆశాజీ పాడిన ఎవర్ గ్రీన్ తెలుగు సాంగ్స్ ఇవే.. మీరు విన్నారా?
Asha Bhosle

Updated on: Apr 12, 2026 | 6:59 PM

దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12) ఆమె తుది శ్వాస విడిచారు. పేరుకు హిందీ గాయని అయినా ఆమెకు అన్ని భాషల్లోనూ ప్రావీణ్యముంది.తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారామె. కేవలం సినిమా పాటలే కాదు పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలోనూ ఆశాజీ సిద్ధహస్తురాలుసుమారు 8 దశాబ్దాల ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం చాలా తక్కువే అయినా, ఆమె పాడిన 8 పాటలు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి.

1981లో ‘పాలు నీళ్లు’ అనే సినిమాలో ‘ఇది మౌనగీతం’ అనే పాటను ఆలపించారు ఆశాజీ. ఇది ఆమె పాడిన మొదటి తెలుగు సాంగ్. ఆ తర్వాత 1988లో ‘చిన్ని కృష్ణుడు’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ‘జీవితం సప్త సాగరం’ అనే గీతాన్ని పాడారు. దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చడం విశేషం.

ఇవి కూడా చదవండి

1992లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అశ్వమేథం’ సినిమాలో ఆశా భోంస్లే రెండు పాటలు ఆలపించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె పాడిన ‘ఓ ప్రేమా’, ‘సీతాకాలం ప్రేమకు’ పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనిపించుకున్నాయి. ఈ సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి.

ఇక 1995లో ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’ సినిమాలో ‘జల్లంది మది’ అనే పాట పాడారు ఆశా భోంస్లే. అలాగే 1996లో ఎంఎం కీరవాణి ‘పవిత్ర బంధం’ సినిమాలో ‘ఐసాలకిడీ’ అనే సాంగ్ ను ఆశాజీతో పాడించారు. వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ఆశా భోంస్లేతో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడించినట్లు చూపిస్తారు.

ఇక మణిరత్నం’ఇద్దరు’ సినిమాలో ‘వెన్నెల వెన్నెల’ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు ఆశాజీ. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఇక ఈ సాంగ్ తర్వాత చాలా ఏళ్లకు 2007లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రంలో ‘నాలో ఊహలకు’ పాట పాడి తెలుగు సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు ఆశాజీ. ఈ సాంగ్ కు కెఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. ఆశాజీ తెలుగులో పాడిన చివరి సాంగ్ ఇదే.

మొత్తంగా తెలుగులో 8 పాటలు ఆలపించి ఇక్కడి ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నారు ఆశా భోంస్లే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us