Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు. శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ సోనాక్షి సిన్హా. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. దబాంగ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది ఈ వయ్యారి. సోనాక్షి సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ అమ్మడు తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక అబ్బాయితో తాను దాదాపు ఐదేళ్లు రిలేషన్ షిప్‌లో ఉన్నానని. చెప్పుకొచ్చింది సోనాక్షి. 21-22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్ ను కొనసాగించానని తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే అది అంత పెద్ద రిలేషన్ షిప్ కాదని సోనాక్షి అంటుంది. అలాగే మనకు ఎదురయ్యే ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పింది సోనాక్షి. మన వయసు పెరిగే కొద్దీ కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయని.. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలని తెలిపింది ఈ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :