
‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్ ‘. . ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో హింసతో పాటు రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అర్థమైంది. ఇక తాజాగా ‘టాక్సిక్’ సినిమా నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కియారా అందాలు ఆరబోసింది. గతంలో ఎన్నడూ లేనంతగా హాట్ హాట్ గా కనిపించింది. అందుకు తగ్గట్టుగానే యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే తబాహి సాంగ్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే ఈ సాంగ్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తబాహి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే సమయంలో ఈ సినిమా కోసం కియారా తీసుకున్న రెమ్యునరేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. . ఈ సినిమాలో కియారా చాలా హాట్‌గా కనిపించింది. అందుకోసం ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా లెవెల్ లో కియారాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగిన పారితోషికాన్నే నిర్మాతలు ఇచ్చారని తెలుస్తోంది. , ‘టాక్సిక్’ చిత్రం కోసం కియారా అద్వానీకి ఏకంగా రూ. 15 కోట్లు పారితోషికంగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది ఆమె సినీ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు కియారా సుమారు రూ. 5 నుంచి 7 కోట్ల పారితోషికం అందుకుంది. దానితో పోలిస్తే, ‘టాక్సిక్’ సినిమాకు ఆమె రెమ్యునరేషన్ డబుల్ అయ్యింది. కియారా అద్వానీకి బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే టాక్సిక్ నిర్మాతలు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ పారితోషికంతో, కియారా అద్వానీ అధికారికంగా భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్ల సరసన చేరింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి