బాలివుడ్ బ్యూటీ అలియా భట్ ఓ వైపు సినిమాలతో పాటు ఫ్యామిలీతో బిజీ బిజీగా గడుపుతుంది. షూటింగ్స్ నుంచి ఏ చిన్న గ్యాప్ దొరికిన భర్త కూతురితో గడిపేస్తుంది అలియా భట్. స్టార్ హీరో రణబీర్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ వయ్యారి. బాలీవుడ్ లో అలియా భట్ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి వచ్చినా కూడా తనకంటూ సపరేట్ క్రేజ్ ను ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. రణబీర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు ఆచి తూచి సినిమాలు చేస్తుంది. రణబీర్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఇద్దరికీ రాహా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అలియా భట్ కూతురు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను చేసిన తప్పు తన కూతురిని చేయనివ్వనని తెలిపింది అలియా భట్. ఇంతకు అలియా ఏం చేసింది.? తన కూతురిని ఏం చెయ్యనివ్వను అంటుంది. అలియా భట్ మాట్లాడుతూ.. హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ కోసం లండన్‌లో ఉన్నాను. నా తల్లి దండ్రులను వదిలి ఉండటం చాలా కష్టంగా అనిపించింది. నాకు మూడు రోజులు నిద్రపోలేదు. నేను మంచి కూతురిని కాదనే ఫీలింగ్ కలిగింది’ అని అలియా భట్ తెలిపింది. తన కూతురిని 20 ఏళ్ల వరకు ఇల్లు వదిలి వేరే చోట సెటిల్ చేయనివ్వనని అలియా చెప్పుకొచ్చింది.
‘నేను ఇంటి నుంచి వెళ్లేటప్పటికి నాకు 23 ఏళ్లు. షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్నాను. అది ఏ నగరమో కూడా నాకు తెలియదు. నేను త్వరగా ఇంటి నుండి బయటకు వచ్చేశా అనిపించింది. నా కూతురికి ఇలా జరగనివ్వడం ఎందుకు.?’ అని అలియా భట్ తెలిపింది. అలాగే ‘నేను భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తిని. కానీ, రాహా విషయంలో అలా కాదు. రాహాకు కింద పడే అవకాశం ఇవ్వకపోతే ఎలా లేవాలో తెలియదని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారని ఆలియా చెప్పుకొచ్చింది. పెళ్లి, పిల్లల కోసం రెండేళ్ల పాటు నటనకు దూరంగా ఉంది అలియా భట్. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది. ఈ బ్యూటీ నెక్స్ట్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తోంది అలియా భట్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.