Tollywood: 14 ఏళ్లకే మద్యం అలవాటు.. ఆపై పచ్చి తాగుబోతుగా.. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరంటే?

ఈ స్టార్ హీరో చాలా చిన్న వయసులోనే మద్యం అలవాటు చేసుకున్నాడు. స్నేహితుల ఒత్తిడితో 14 ఏళ్ల వయసులోనే ఆల్కహాల్ రుచి చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అది అలవాటుగా మారిపోయింది. క్రమంగా మద్యానికి బానిస అయిపోయాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు..

Tollywood: 14 ఏళ్లకే మద్యం అలవాటు.. ఆపై పచ్చి తాగుబోతుగా.. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరంటే?
Bollywood Actor

Updated on: Nov 09, 2025 | 11:08 AM

సినిమా స్టార్లదీ లగ్జరీ లైఫ్. పార్టీలు, పబ్బులు, విందులు, వినోదాలు సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్‌. చాలా మంది ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఈ లిస్టులో ఈ స్టార్ హీరో కూడా ఉన్నాడు. అయితే అది కంట్రోల్ గా.. ఒక లిమిట్ మోతాదులో మాత్రమే. అయితే ఇదే స్టార్ హీరో ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. చాలా చిన్న వయసులోనే మద్యం తాగడం మొదలుపెట్టాడీ ట్యాలెంటెడ్ హీరో. సరిగ్గా 14 ఏళ్లప్పుడు మొదటి సారి మద్యం రుచి చూశాడు. ప్రారంభంలో సరదాగా తాగినా.. నెమ్మదిగా అది అలవాటుగా మారిపోయింది. క్రమంగా రోజూ తాగడం మొదలు పెట్టాడు. నిజం చెప్పాలంటే మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. కొన్ని సార్లు మానుకోవాలని చాలా ట్రై చేశాడు. కానీ ఈ పాడు అలవాటును వదులుకోలేకపోయాడు. చివరకు పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. దీంతో ఈ డ్రింకింగ్ కు బ్రేక్ చెప్పడం చాలా అవసరమైంది. ఈ అలవాటును కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక వెల్‌నెస్ స్పాలో చేరాడు. అక్కడే సుమారు ఒక నెల రోజుల పాటు ఉండి మద్యం అలవాటును మానుకున్నాడు. ఈ నిర్ణయమే తన జీవితాన్ని మార్చేసిందంటున్నాడీ స్టార్ హీరో. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? బాలీవుడ్ సింగం అజయ్ దేవ్‌గణ్.

బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అజయ్ దేవ్‌గణ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. అతను నటించిన పలు సూపర్ హిట్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడీ స్టార్ హీరో. కాగా ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిసైన అజయ్ ఇప్పుడు 30 ml మాల్ట్ మాత్రమే తీసుకుంటాడట. కొన్నిసార్లు రెండు పెగ్గులు తీసుకుంటాడట. అంతే అంతకు మించి హద్దులు దాటడట. ఈ విషయాన్ని స్వయంగా అజయే చెప్పాడు. తనలో ఇంత మార్పు రావడానికి కారణం తన భార్య కాజోలే నంటాడీ స్టార్ హీరో. అలాగే తన కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉందంటాడు. తన పిల్లలు న్యసా, యుగ్‌ లకు తాను ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలనే ఆలోచన కూడా తనను మద్యం అలవాటుకు దూరం చేసిందంటాడు అజయ్.

ఇవి కూడా చదవండి

 భార్య కాజోల్, పిల్లలతో హీరో అజయ్ దేవ్ గణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.