Bigg Boss Telugu 8: ఈసారి బిగ్ బాస్‌లోకి రెండు జంటలు.. సపరేట్ రూమ్స్.. ఇక రచ్చ రచ్చే

|

Jul 12, 2024 | 6:28 PM

బిగ్ బాస్ సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక సీజన్ 7 మొదలైన దగ్గర నుంచి రచ్చ రచ్చగా సాగింది. సీరియల్ బ్యాచ్ కు పల్లవి ప్రశాంత్ కు మధ్య జరిగిన గొడవలు, గోలలు, ఏడుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఫినాలే రోజు నెక్స్ట్ లెవల్ లో రచ్చ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పెద్ద విధ్వంసమే చేశారు.

Bigg Boss Telugu 8: ఈసారి బిగ్ బాస్‌లోకి రెండు జంటలు.. సపరేట్ రూమ్స్.. ఇక రచ్చ రచ్చే
Biggboss8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షో కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8లోకి అడుగు పెట్టనుంది. సీజన్ 7 లో ఎంత పెద్ద రచ్చ అయ్యిందో అందరికి తెలుసు. బిగ్ బాస్ సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక సీజన్ 7 మొదలైన దగ్గర నుంచి రచ్చ రచ్చగా సాగింది. సీరియల్ బ్యాచ్ కు పల్లవి ప్రశాంత్ కు మధ్య జరిగిన గొడవలు, గోలలు, ఏడుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఫినాలే రోజు నెక్స్ట్ లెవల్ లో రచ్చ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పెద్ద విధ్వంసమే చేశారు. బస్సుల పై, కార్ల పై దాడి కూడా చేశారు కొందరు ఆకతాయిలు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుందని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎవరు వెళ్లనున్నారు అనే దాని పై సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హౌస్‌లోకి వెళ్ళేది వీరే అంటూ కొన్ని పేరు వైరల్ అవుతున్నాయి. కుమారీ ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్, యాంకర్స్ రీతూ చౌదరి, వర్షిణి, వేణు స్వామి, సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి కపుల్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ చాలా మంది కపుల్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు.

వరుణ్ సందేశ్, వితిక. మెరీనా, రోహిత్ హౌస్‌లోకి అడుగు పెట్టి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా రెండు జంటలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఇద్దరు జంటలకు వేరు వేరు రూమ్స్ కూడా ఏర్పటు చేయనున్నారట. ఇక మొగుడు పెళ్ళాలు అంటే ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అంతే కాదు ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి రీతూ చౌదరి, వర్షిణి లాంటి హాట్ బ్యూటీస్ కూడా అడుగుపెట్టనున్నారు. దాంతో హౌస్‌లో ఓ రేంజ్‌లో గ్లామర్ షో ఉంటుందని తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎవరు హౌస్‌లోకి అడుగు పెడతారు అనేది చెప్పలేం.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.