
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. హౌస్ లో ఉన్న వారిలో ఈ వారం ;ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు. హౌస్ రెండు టీమ్స్ ఉన్న విషయం తెలిసింది. స్పై టీమ్, స్పా టీమ్ ఒకటి శివాజీ టీమ్ అయితే మరొకటి సీరియల్ బ్యాచ్. మొన్నటి వరకు నామినేషన్స్ సమయంలో గొడవ పడ్డారు. నిన్నటి వరకు ఓట్ అపీల్ కోసం గొడవపడ్డారు హౌస్ మేట్స్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి గేమ్స్ ఇచ్చాడు తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. డే 96కు సంబంధించిన ప్రోమో ఇది. ఈ ప్రోమోలో శోభా శెట్టి, శివాజీ మధ్య వార్ జరిగినట్టు చూపించారు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో ప్రియాంక శివాజీ తలపడుతున్నారు. ఒకరి పై ఒకరు బాల్స్ విసిరేసుకుంటూ ఉండాలి అవి తమ బాడీకి తగలకుండా జాగ్రత్త పడాలి బాడీకి తగిలితే అవి అతుక్కు పోతాయి. ఈ గేమ్ లో అందరూ అవుట్ అయ్యారు.
చివరకు ప్రియాంక, శివాజీ మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరు మధ్య జరుగుతున్న పోటీకి శోభను సంచలక్ గా పెట్టాడు బిగ్ బాస్. అయితే గేమ్ మొదలైన దగ్గర నుంచి శోభా ప్రియాంకాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. జాగ్రత్త ప్రియాంకా, కాన్సన్ట్రేట్ ప్రియాంకా అంటూ పదిసార్లు ప్రియాంక పేరు చెప్పింది శోభా. దాంతో శివాజీకి కాలింది. నేను ఆడాను అంటూ బాల్స్ విసిరేసి బయటకు వెళ్ళిపోయాడు శివాజీ.
పొద్దాకా ప్రియాంకా.. ప్రియాంకా అంటుంటే మేము ఏం పీకడానికి అంటూ సీరియస్ అయ్యాడు శివాజీ. నేను అవుట్ అంటూ గట్టిగా అరిచి గోల చేశాడు. యావర్ వచ్చి అన్న ఆడు అన్నా అని అన్న కూడా శివాజీ వినలేదు. అది నా ఇష్టం. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా అని అంది శోభా.. ఏది సంచలక్ గా ఉండా..? అని ప్రశ్నించాడు శివాజీ. సంచలక్ అయినా.. శోభా అయినా నా ఇష్టం.. నేను ప్రియాంకాకు సపోర్ట్ చేస్తా అని అంది శోభా. దాంతో ఇద్దరి మధ్య గట్టి వాదనే జరిగింది. శివాజీ మాట్లాడుతుంటే వెటకారంగా మాట్లాడింది శోభా.. దానికి శివాజికి ఇంకా కాలింది. కొంచం మంచిగా అలవాటు చేసుకో అని బుద్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా శోభా వినలేదు.. ఇంకా వెటకారం చేసింది. ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని చెప్పాడు శివాజీ. మొత్తం మీద గొడవ గట్టిగానే జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.