Bigg Boss Telugu6: మొదటి రోజే రచ్చ రచ్చ చేసిన గలాట గీతూ.. బిగ్ బాస్ చెప్పినా ఆ పని చేయను అంటూ హంగామా..

|

Sep 06, 2022 | 7:23 AM

తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఎలా 4న గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యింది.

Bigg Boss Telugu6: మొదటి రోజే రచ్చ రచ్చ చేసిన గలాట గీతూ.. బిగ్ బాస్ చెప్పినా ఆ పని చేయను అంటూ హంగామా..
Bigg Boss 6
Follow us on

తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఎలా 4న గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu6) ప్రారంభం అయ్యింది. ఎప్పటిలానే ఎంతో హుషారుగా ఈ సీజన్ ను కూడా హోస్ట్ చేయనున్నారు కింగ్ నాగార్జున.. బిగ్ బాస్ ఇంట్లోకి పంపించడం, సీక్రెట్ రూంలు, టాస్కులు, డ్యాన్సులు అంటూ హంగామా చేయడానికి బిగ్ బాస్ రెడీ అయిపోయింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపారు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు. ఇక మొదటి రోజే నుంచే బిగ్ బాస్ హౌస్ లో హీట్ స్టార్ట్ అయ్యింది.

ఇక హౌస్ లోకి వచ్చిన వారిలో గలాట గీతూ ఎక్కువ హడావిడి చేస్తోంది. ఈ అమ్మడి గొంతే ఎక్కువగా వినిపిస్తోంది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ గీతూ- ఇనయ సుల్తానా తిట్టుకున్నారు. బాత్రూంలో ఎవరివో వెంట్రుకలున్నాయంటూ రచ్చ స్టార్ట్ చేసిన గీతూ.. ఎవరి హెయిర్స్ వాళ్లే తీయాలి.. ఒకవేళ నాకు బిగ్ బాస్ ఇదే టాస్క్ ఇచ్చినా కూడా నేను అయితే వాటిని తీయను అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇదే విషయాన్నీ ఇనయ సుల్తాన దగ్గర ప్రస్తావించింది గీతూ.. ఆతరువాత తిక్క దాన అని ఇనయనుతిట్టింది గీతూ. నువ్వే తిక్కదానివి అంటూ ఇద్దరూ తిట్టేసుకున్నారు. ఈ వ్యవహారం పై గీతూకి సలహా ఇచ్చాడు బాలాదిత్య. చెప్పిన విషయం కరెక్టే అయినా విధానం తప్పు అంటూ గీతూకి చిన్న క్లాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ క్లాస్ మాస్ ట్రాష్..అనే టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో క్లాస్‌కు స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుందని., ఏ పనైనా చేయించికోవచ్చు.. వీఐపీ బాల్కనీ వాడుకోవచ్చు.. కెప్టెన్నీ పోటీదారులయ్యే అవకాశం ఉంటుంది.. నేరుగా నామినేషన్ నుంచి సేవ్.. అవుతారు. అలాగే  ట్రాష్ సభ్యులు.. గార్డెన్ ఏరియాలోనే వండుకుని తినాలి.. కెప్టెన్ పోటీలో ఉండరు.. డైరెక్ట్ గా  నామినేట్ అవుతారు. ఇక మాస్ సభ్యులు.. సామాన్యులుగా ఉంటారు. ఎటువంటి అధికారులు ఉండవు.. చివరకు మాస్ సభ్యుల్లో ముగ్గురు క్లాస్, ముగ్గురు ట్రాష్ ఉంటారు అని తెలిపాడు బిగ్ బాస్. అందులో బాలాదిత్య, శ్రీహాన్, సూర్యలు క్లాస్.. రేవంత్, గీతూ, ఇనయ సుల్తానలు ట్రాష్‌‌లోకి వచ్చారు. మిగిలిన అందరూ కూడా మాస్ సభ్యులు అని ఓటింగ్ లో తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి