Bigg Boss 10 telugu: రోహిత్‌తో అలా, త్రిగుణ్‌తో ఇలా..! ఇద్దరికీ క్లాస్ తీసుకున్న నాగార్జున.. ఇదేం వీకెండ్ ఎపిసోడ్.?
బిగ్ బాస్ సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ మేట్స్ మధ్య విభేదాలు తొలి రోజు నుంచే మొదలయ్యాయి. హౌస్ లో రెండు టీమ్స్ డివైడ్ చేశారు బిగ్ బాస్. అలాగే హౌస్ లో ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు.

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ వారం హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్ మాట్లాడిన మాటలకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతారని చాలామంది భావించారు. కానీ వీకెండ్ ఎపిసోడ్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నాగార్జున రోహిత్‌పైనే ఎక్కువగా సీరియస్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముగ్గురు కంటెస్టెంట్స్‌కు మిల్క్ షేక్ ట్రీట్
ముందుగా హౌస్‌మేట్స్‌గా ఎంపికైన ముగ్గురు కంటెస్టెంట్స్ వంశీ, రామ్ ప్రసాద్, రోహిత్ ను అభినందించిన నాగార్జున.. మీ ముగ్గురూ ఆటను షేక్ ఆడించారని, అందుకే మీకు బిగ్ బాస్ మిల్క్ షేక్ ఇవ్వబోతున్నారని చెప్పారు. అనంతరం వారికి మిల్క్ షేక్‌లు అందించారు. అయితే అసలు ట్విస్ట్ ఆ తర్వాతే మొదలైంది. కంటెస్టెంట్స్ మిల్క్ షేక్ తాగిన గ్లాసులను స్టేజ్‌పైకి తెప్పించుకున్న నాగార్జున.. వాటిని తానే కడుగుతానని చెప్పారు. వాళ్లు ఆటను షేక్ ఆడించినందుకు మిల్క్ షేక్ ఇచ్చామని, వాళ్లు తాగిన గ్లాసులను తానే శుభ్రం చేస్తానని పేర్కొన్నారు. నాగార్జున ఆ మాట చెప్పగానే త్రిగుణ్ చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ కు క్లాస్ తీసుకున్నారు నాగార్జున
రోహిత్‌కు గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున
హౌస్‌లో ఎవరి ప్లేట్ వాళ్లే, ఎవరి గ్లాస్ వాళ్లే కడుక్కోవడం సాధారణంగా కనిపించే విషయం. అయితే రోహిత్ గతంలో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడగడం గురించి అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన నాగార్జున.. ఏ పనీ చిన్నది కాదని, ఏ పనీ తక్కువది కాదని చెప్పారు. ఇలాంటి ఆలోచనలు ఉంటే హౌస్‌లో ఉండకూడదంటూ రోహిత్‌కు చురకలు వేశారు. తన చేతులకు క్రీమ్ లేదని, ఇతరులు తాగిన గ్లాసులు తాను ఎందుకు కడగాలని అనుకోవడం సరైనది కాదని క్లాస్ పీకారు. దీంతో రోహిత్ తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నాగార్జున మాత్రం అతని మాటల్లోని తప్పును ఎత్తిచూపుతూ, హౌస్‌లో పాత్రలు కడగడం కూడా అతని బాధ్యతేనని స్పష్టం చేశారు.
త్రిగుణ్‌కు మాత్రం అంత సీరియస్ వార్నింగ్ కనిపించలేదా?
రోహిత్‌పై నాగార్జున ఆ రేంజ్ లో సీరియస్ అవడంతో.. త్రిగుణ్‌కు కూడా అదే స్థాయిలో క్లాస్ పడుతుందని ప్రేక్షకులు భావించారు. ఎందుకంటే రోహిత్‌తో గొడవ సమయంలో త్రిగుణ్.. ‘పిల్ల బచ్చా’, ‘డొల్ల రాజా’, ‘స్టెరాయిడ్ డొల్లా’ వంటి వ్యాఖ్యలు చేశాడు. నాగార్జున ఈ మాటలను గుర్తుచేసి త్రిగుణ్‌ను ప్రశ్నించారు. వెంటనే త్రిగుణ్ సారీ సార్ అంటూ క్షమాపణలు చెప్పాడు. అయితే ఆ తర్వాత నాగార్జున అతనికి పెద్దగా క్లాస్ తీసుకోకుండా.. త్రిగుణ్ అనే వ్యక్తికి అసలు గుణమే లేదని ఈ మూడు మాటలు నిరూపిస్తున్నాయని అన్నారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న పెద్ద టైర్‌ను ఎత్తుకుని తాను చెప్పే వరకు తిరగాలని త్రిగుణ్‌కు శిక్ష విధించారు. త్రిగుణ్ మాత్రం ఆ శిక్షను కూడా నవ్వుతూ స్వీకరించాడు.
రోహిత్‌పై సీరియస్.. త్రిగుణ్‌పై సాఫ్ట్.. ఎందుకీ తేడా?
ఇక్కడే అసలు చర్చ మొదలైంది. రోహిత్‌పై నాగార్జున సీరియస్ అయిన స్థాయిలో కనీసం పది శాతం కూడా త్రిగుణ్‌పై సీరియస్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిగుణ్ మాట్లాడిన మాటలు తీవ్రంగా ఉన్నప్పటికీ, అతనికి ఇచ్చిన శిక్ష మాత్రం చాలా తేలికగా అనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో యాక్షన్‌కు రియాక్షన్‌తో పాటు ఇమీడియట్ పనిష్‌మెంట్ కూడా ఉంటుందని నాగార్జున చెప్పినప్పటికీ.. త్రిగుణ్ విషయంలో ఆ స్థాయిలో కఠినంగా వ్యవహరించలేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.
కంటెంట్ కోసమే త్రిగుణ్‌ను వెనకేసుకొస్తున్నారా?
బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, వివాదాలు, మాటల యుద్ధాలు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తాయి. ఈ వారం త్రిగుణ్ ఎక్కువగా గొడవల్లో పాల్గొని, హౌస్‌లో హీట్ పెంచాడనే అభిప్రాయం ఉంది. అలాంటి కంటెస్టెంట్‌ను గట్టిగా మందలిస్తే అతని ఆట డౌన్ అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. త్రిగుణ్ లాంటి కంటెస్టెంట్స్ వల్లే హౌస్‌లో గొడవలు కొనసాగుతాయని, దానివల్ల షోకు కావాల్సిన కంటెంట్ వస్తుందని విమర్శకులు అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మాత్రమే. మొత్తంగా ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో రోహిత్‌కు నాగార్జున గట్టిగా క్లాస్ పీకగా.. త్రిగుణ్‌కు మాత్రం తేలికపాటి శిక్షతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో త్రిగుణ్‌కు మందలింపు లేకపోవడంతో.. ఆడియన్స్ లో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
