Bigg Boss: ఇవేం టాస్క్‌లురా అయ్యా..! తీవ్రంగా గాయపడ్డ కంటెస్టెంట్.. జస్ట్ మిస్

బిగ్ బాస్ గేమ్ షోలో హౌస్ మేట్స్ కు రకరకాల టాస్క్ లు ఇస్తుంటారు. ఆ టాస్క్ ల్లో విజేతలుగా నిలిచిన వారికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తుంటారు. కొన్నిసార్లు ఈ టాస్క్ ల్లో కంటెస్టెంట్స్ కు గాయాలు కూడా అవుతుంటాయి.

Bigg Boss: ఇవేం టాస్క్‌లురా అయ్యా..! తీవ్రంగా గాయపడ్డ కంటెస్టెంట్.. జస్ట్ మిస్
Bigg Boss 9

Updated on: Nov 12, 2025 | 12:22 PM

బిగ్ బాస్ గేమ్ షో అన్ని భాషల్లోనూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ రియాలిటీ గేమ్ షో మంచి టీఆర్పీ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్ బాస్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తమిళ్ లో బిగ్ బాస్ గేమ్ షో 8 సీజన్స్ పూర్తి చేసుకొని.. సీజన్ 9లోకి అడుగుపెట్టింది. తమిళ్ లో విజయ్ సేతుపతి హౌస్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య టాస్క్ లు జరగడం అనేది చాలా కామన్.. కొన్ని సార్లు హౌస్ మేట్స్ ఈ టాస్క్ ల్లో గాయపడుతూ ఉంటారు. తాజాగా ఓ హౌస్ మెట్ కు టాస్క్ ల్లో తీవ్రంగా గాయం అయ్యింది.

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న నటి VJ పార్వతి కి తీవ్ర గాయం అయ్యింది. టాస్క్ లో భాగంగా ఆమె ఇతర హౌస్ మేట్స్ తో పోటీ పడుతుండగా ఆమెకు గాయం అయ్యింది. దాంతో కన్ను భాగం వాచిపోయింది. BB బాటిల్ హంట్ అనే టాస్క్ లో భాగంగా శబరీనాథ్ తానే కంటెస్టెంట్ చేతిలో ఆమెకు గాయం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

టాస్క్‌లో భాగంగా పొరపాటున శబరీనాథ్ మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దాంతో ఆమె నొప్పితో తల్లడిల్లిపోయింది. గాయం కారణంగా కన్ను భాగం మొత్తం వాపు ఏడ్పడింది. ఆతర్వాత నల్లగా మారిపోయింది. అంత గాయం తర్వాత కూడా పార్వతి తన ఆటను కొనసాగిస్తానని చెప్పింది. తమిళ్ బిగ్ బాస్ లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది పార్వతి. టాప్ 3లో కొనసాగుతుంది పార్వతి. ఆమెకు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది.

విజే పార్వతికి గాయం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us