బిగ్ బాస్ సీజన్ 7 మాంచి రంజుగా సాగుతుంది. ఆ సీరియల్ బ్యాచ్, శివాజీ తప్ప మిగిలనవాళ్లు పెద్దగా జనాలకు తెలియదు. బయట ఫేమ్ లేనివారు అయినా సరే బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రవర్తన బాగుంటే.. ఫేమ్ వస్తుంది. ఫాలోవర్స్ పెరుగుతారు. లోపల నామినేషన్స్ ఎలా చేస్తున్నారు.. వాళ్లు వాదించే పాయింట్స్ ఎలా ఉన్నాయ్..? పనులు చేస్తున్నారా లేదా..? అందరితో ఎలా ఉంటున్నారు.. బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారా..? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు ఆడియెన్స్. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినవాళ్లను బయట ఉన్న వారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ సోదరుడు ఇచ్చిన సమాధానాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 మొదలవ్వకముందు ప్రిన్స్ యావర్ అంటే ఎవరో కూడా ఎవరికి తెలీదు. ఒక మోడల్, యాక్టర్ అంటూ.. ప్రేక్షకులకు అతడ్ని పరిచయం చేశారు. తెలుగు రాకపోయినప్పటికీ టాస్కులు బాగా ఆడుతూ జనాల అటెన్షన్ గెయిన్ చేశాడు. అతడికి పదే, పదే అన్యాయం జరగడం కూడా జనాల్లో ఎలివేట్ అయ్యేందుకు కారణమయ్యింది. కోపం వచ్చినప్పుడు మాత్రం యావర్ ప్రవర్తన.. భీతిగొల్పేలా ఉంది. దీంతో ఇంట్లో యావర్ ప్రవర్తనపై, అసలు బిగ్ బాస్ షోపై.. అతని సోదరుడు కామెంట్స్ చేశాడు.
బిగ్ బాస్‌లో హౌజ్‌మేట్స్ అంతా కలిసి ప్రిన్స్ యావర్‌ను టార్గెట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రతీ గేమ్‌లో ప్రిన్స్‌ను ఓడిపోయేలా చేస్తున్నారు, బిగ్ బాస్‌లో పాలిటిక్స్ జరుగుతున్నాయని పేర్కొన్నాడు యావర్ బ్రదర్. అందరిలోనూ యావర్ చాలా స్ట్రాంగ్ అని.. అందుకే వాళ్లు తనను నామినేట్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తన అన్న ప్రిన్స్‌ది చిన్నపిల్లవాడడి మనస్తత్వమని… అతడి ప్రవర్తన అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. వీక్ కంటెస్టెంట్ అయిన టేస్టీ తేజను కావాలనే కాపాడుతున్నారని చెప్పుకొచ్చాడు. యావర్‌ను నామినేట్ చేసి బయటకు పంపించి.. ఆ తర్వాత అందరూ సేఫ్‌గా ఆడాలని అనుకుంటున్నారని తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.
తెలుగు రాకపోయినా టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు యావర్. మొదట్లో యావర్ అంటే ఎవరు అని అడిగేవారు.. ఇప్పుడు యావర్‌కే మా ఓటు అంటున్నారు. ఇతర కంటెస్టెంట్స్ అందరూ అతడిని టార్గెట్ చేయడం వల్ల.. యావర్‌కి హైప్ వచ్చింది. అతడు ఏం మాట్లాడిన స్క్రీన్ స్పేస్ దొరకుతుంది. ఇటీవల కాలంలో అతడిని హోస్ట్ నాగార్జున కూడా పలుమార్లు అభినంధించారు. అయితే అగ్రెసీవ్ నేచర్ లాగే కొనసాగితే మాత్రం.. అతడికి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.