ఘోరమైన యాక్సిడెంట్.. చావు నుంచి బయటపడ్డా.. గీతూ రాయల్ ఎమోషనల్ వీడియో

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ బజ్‌కు హోస్ట్ గా వ్యవహరించింది.

ఘోరమైన యాక్సిడెంట్.. చావు నుంచి బయటపడ్డా.. గీతూ రాయల్ ఎమోషనల్ వీడియో
Geethu Royal

Updated on: Jun 19, 2025 | 11:50 AM

బిగ్ బాస్ తెలుగు గేమ్ షో ద్వారా చాలా మంది సినిమా ఛాన్స్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఫెడ్ అవుట్ అవుతున్న టైం లో బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్తే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు.. తద్వారా సినిమాల్లో తిరిగి రాణించవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది విషయంలో అలా జరగలేదు. ఇక బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా వారిలో గీతూ రాయల్ ఒకరు. చిత్తూరు చిరుత అంటూ అక్కడి యాసతో మాట్లాడుతూ ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నేను ఇలానే ఉంటా.. నాకు నచ్చినట్టే ఆడుతా అంటూ బిగ్ బాస్ హౌస్ లో గీతూ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. అందరిదీ ఒకదారి అయితే నాది మరోదారి అంటూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించిన గీతూ టాప్ 5లో ఉంటుందని అనుకుంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బోరుమని ఏడ్చింది.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో బిజీ అయ్యింది ఆమె.. రెగ్యులర్ గా ఎదో ఒక వీడియో షేర్ చేస్తుంటుంది. సమాజంలో జరిగే సంఘటనల గురించి ఆమె ఎక్కువగా మాట్లాడుతూ వీడియోలు చేస్తుంటుంది. తాజాగా గీతూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య ఎక్కడ చూసిన జనాలు చనిపోయిన న్యూసే వినిపిస్తుంది.. మరీ చీమలు చచ్చిపోయినట్టు పోతున్నారు జనాలు. హ్యాపీగా హనీమూన్‌కి వెళ్దామని వెళ్తే అక్కడ టెర్రరిస్టులు చంపేస్తున్నారు. లేదా భార్య చంపిస్తుంది.. తల్లి పిల్లల్ని చంపి కుక్కర్లో ఉడకబెడుతుంది. బస్సులు, రైళ్లు , విమానాల యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. మొన్న విమాన ప్రమాదంలో 250మంది చనిపోయారు.

నాకు కూడా 20 రోజుల క్రితం ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ సెకెండ్‌లో చావు నుంచి బయట పడ్డాను. మనం బతికి ఉన్నాము అంటే అది అదృష్టమనే చెప్పాలి. అందుకే మనకు నచ్చింది చేసెయ్యాలి.. అందరిని ప్రేమించాలి. నీ ఎమోషన్స్ అన్ని చూపించెయ్.. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వేరేవాళ్లకు భాద కలిగించనంత వరకు నెక్స్ట్ సెకన్ నువ్వు చనిపోయినా నీకు ఎలాంటి పశ్చాత్తాపం కలగదు అనేలా జీవించాలి అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.