
బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొని ఒక్కసారి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పకుంది అందాల తార దివి వైద్య.

అంతకు ముందు మహర్షితో పాటు పలు సినిమాల్లో తళుక్కుమన్నా అవి ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా భారీగా ఫేమ్‌ను సంపాదించుకుందీ చిన్నది.

కేవలం అందంతోనే కాకుండా హౌజ్‌లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ఇక దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ క్రమంలోనే దివి తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వీటిలో బ్లూ కలర్ డ్రస్‌లో కర్లీ హెయిర్స్‌తో కుర్రకారు మతి పోగొడుతోందీ చిన్నది. ఇవి చూసిన అభిమానులు దివి నుంచి దిగివచ్చావా బ్యూటీ అంటూ ఫిదా అవుతున్నారు.