Bigg Boss 7: టేస్టీ తేజాకు స్పాట్ పెట్టిన శివాజీ ఫ్యాన్స్.. కథ కంచికే

|

Oct 16, 2023 | 3:39 PM

అయితే టేస్టీ తేజాతో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటారు శివాజీ. అతడిని కూడా అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు సదారాగా సైటైర్లు వేసుకుంటూనే ఉంటారు. కానీ ఎదురుగా ఉన్నప్పడు అనుకోవడం వేరు.. వేరే వాళ్ల మందుకు వెళ్లినప్పుడు తూలనాడటం వేరు. తేజ ఆ పనే చేశాడు. చేయికి దెబ్బ తగడంలో కాస్త ఇబ్బందికరంగానే టాస్కుల్లో పాల్గొంటున్నాడు శివాజీ.

Bigg Boss 7: టేస్టీ తేజాకు స్పాట్ పెట్టిన శివాజీ ఫ్యాన్స్.. కథ కంచికే
Tasty Teja - Sivaji
Follow us on

చాణుక్యుడులా ఆలోచిస్తూ.. తనను నమ్ముకున్నవారిని, తన పంచన చేరినవారిని గెలిపిస్తూ బిగ్ బాస్ ఇంట్లో ముందుకు సాగుతున్నాడు శివాజీ. ఆయన నామినేషన్స్‌లో ఉంటే.. అదేదో దండయాత్ర మాదిరి ఓట్లు గుద్దేస్తున్నారు జనాలు. 46 ఏళ్ల వయస్సులో బిగ్ బాస్‌కి వచ్చి ఈ స్థాయిలో జనాధారణ పొందిన కంటెస్టెంట్ శివాజీ అనే చెప్పాలి. ఆచి.. తూచి మాట్లాడటం.. ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండటం.. అన్ని విషయాల్లో పరిణితి ప్రదర్శించడం వంటి క్వాలిటీలు ఆయన్ను మోస్ట్ లవ్వింగ్ కంటెస్టెంట్‌గా నిలబెట్టాయి. ఇక పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్స్ చేయడంలో కూడా కీలక భూమిక పోషించాడు శివాజీ. తాను గెలవడం కంటే.. తనను నమ్ముకున్నవాళ్లను గెలిపిస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు శివాజీ.

అయితే టేస్టీ తేజాతో కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటారు శివాజీ. అతడిని కూడా అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు సదారాగా సైటైర్లు వేసుకుంటూనే ఉంటారు. కానీ ఎదురుగా ఉన్నప్పడు అనుకోవడం వేరు.. వేరే వాళ్ల మందు ఒక మనిషిని తూలనాడటం వేరు. తేజ ఆ పనే చేశాడు. చేయికి దెబ్బ తగడంలో కాస్త ఇబ్బందికరంగానే టాస్కుల్లో పాల్గొంటున్నాడు శివాజీ. ఆయన అనుభవం, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా బిజ్జలదేవ అంటూ సంభోదించాడు తేజ. అంతేకాదు టాస్కులో బిజ్జల దేవుడ్ని ఈజీగా ఓడిస్తానని గౌతమ్‌ ముందు హేళనగా మాట్లాడాడు. ఎదురుగా ఒక మాట అనుకోవడం వేరు.. ఇలా ఒక వ్యక్తి ఇబ్బందిని ఆయన లేని సమయంలో చులకన చేసి మాట్లాడటం అయితే తప్పు. తేజ మాత్రం ఆ సిట్యువేషన్‌లో మితిమీరి ప్రవర్తించాడు.

దీంతో శివాజీ ఫ్యాన్స్ హర్టయ్యారు. మా అన్న నిన్ను ప్రేమగా చూసుకుంటే.. నువ్వు ఇలా కథలు పడతావా అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. అంతెందుకు చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం.. ఈ సారి నామినేషన్స్‌ ఉన్నప్పుడు చూసుకుందాం అని సవాల్ విసురుతున్నారు. ఇప్పుడిప్పుడే గేమ్ పరంగా ట్రాక్‌లోకి వస్తున్నాడు తేజ. గౌతమ్‌ని బెల్ట్‌తో కొట్టిన సందర్భాన్ని వీక్షకులు మర్చిపోతున్నారు. ఈ సమయంలో బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న శివాజీని బ్యాడ్ కామెంట్ చేసి మరోసారి చిక్కుల్లో పడ్డాడు తేజ. ఈసారి నామినేషన్స్‌లో ఉంటే మనోడు కథ కంచికే అనిపిస్తుంది.. శివాజీ ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.