
బిగ్ బాస్ సీజన్ 7 వారాంతం వచ్చిందంటే చాలు హౌస్ నుంచి ఎవరో ఒకరు బయటకు వస్తున్నారు. సీజన్ 7లో ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కింగ్ నాగార్జున. అందుకు తగ్గట్టుగానే హౌస్ లోకి ముందుగా 13 మందిని పంపించి వారు నుంచి కొంతమంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారని తెలిపారు. అలాగే మొదటి వారంలో హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉండటంతో ఎవరో హౌస్ నుంచి బయటకు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి నామినేషన్ లో తొమ్మిది మంది ఉన్నారు. షకీలా, రతిక
ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది వీరే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ లో త్రిబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని టాక్. ముందుగానే చెప్పిన విధంగా ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. ఈ క్రమంలోనే హౌస్ నుంచి ముగ్గురిని బయటకు పంపుతారాని తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ జరిగింది కానీ ముగ్గురిని ఎప్పుడూ హౌస్ నుంచి బయటకు పంపలేదు. కానీ మొదటి సారి ఇలా చేయనున్నారని తెలుస్తోంది.
ఒకేసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అని ప్రకటించి ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపుతారని తెలుస్తోంది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే వారిలో పల్లవి ప్రశాంత్ ఉంటాడని టాక్. అతడిని ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించి సీక్రెట్ రూమ్ లో ఉంచి ఆతర్వాత తిరిగి తీసుకువస్తారని తెలుస్తోంది . అయితే పల్లవి ప్రశాంత్ ను ఈ వారం ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచి ఆ తర్వాత తిరిగి తీసుకువస్తారని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ కు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో కావాల్సినంత సింపతీ వర్కౌట్ అయ్యింది. హౌస్ లో ఉన్నవారు తనను టార్గెట్ చేయడంతో బయట ఉన్న ప్రేక్షకుల్లో అతడికి ఆదరణ పెరిగింది. ఓటింగ్ విషయంలోనూ మన రైతు బిడ్డ ముందున్నాడు అని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ ను ఎలిమినేట్ అయ్యాడు అని ప్రకటించడం తో బిగ్ బాస్ మరింత రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు బిగ్ బాస్ టీమ్. చూడాలి మరి ఏం జరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..