Bigg Boss 7 Telugu : అనుకున్నటే అయ్యింది.. హౌస్ నుంచి దామిని ఎలిమినేట్

|

Sep 25, 2023 | 9:15 AM

చెప్పినట్టుగానే సెలబ్రటీ గెస్ట్ తో వచ్చి సందడి చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ లో సందడి చేశారు. హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించారు. హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా విడదీసి గేమ్ ఆడించారు నాగ్. ఒక టీమ్ పేరు స్కంద.. మరో టీమ్ పేరు ఇస్మార్ట్ అని పెట్టి గేమ్ ఆడించారు. ట్యూన్ ను గుర్తుపట్టి దానికి సరైన ఆన్సర్ చెప్పి ఆపాటకు డ్యాన్స్ చేయాలి. అలాగే అపోజిట్ టీమ్ నుంచి ఒకరిని ఎంపిక చేసి వారితో పోటీపడి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో స్కంద టీమ్ విన్ అయ్యారు. 

Bigg Boss 7 Telugu : అనుకున్నటే అయ్యింది.. హౌస్ నుంచి దామిని ఎలిమినేట్
Damini
Follow us on

బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం కూడా ముగిసింది. అనుకున్నట్టే హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కింగ్ నాగార్జున మంచి ఊపుమీద కనిపించారు. చెప్పినట్టుగానే సెలబ్రటీ గెస్ట్ తో వచ్చి సందడి చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ లో సందడి చేశారు. హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించారు. హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా విడదీసి గేమ్ ఆడించారు నాగ్. ఒక టీమ్ పేరు స్కంద.. మరో టీమ్ పేరు ఇస్మార్ట్ అని పెట్టి గేమ్ ఆడించారు. ట్యూన్ ను గుర్తుపట్టి దానికి సరైన ఆన్సర్ చెప్పి ఆపాటకు డ్యాన్స్ చేయాలి. అలాగే అపోజిట్ టీమ్ నుంచి ఒకరిని ఎంపిక చేసి వారితో పోటీపడి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో స్కంద టీమ్ విన్ అయ్యారు.

ఆ తర్వాత రామ్ కు శివాజీ ఓ సలహా ఇచ్చారు. త్వరగా పెళ్లి చేసుకో రామ్.. చేయాల్సింది చాలా ఉంది అని అన్నాడు. దానికి రామ్ నవ్వుతూ.. రామ్ ఇష్టంతో చెబుతున్నారా లేదా బాధగా చెప్తున్నారా..? అన్నాడు. దీనికి వెంటనే నాగ్ ఊబిలో ఉన్నోళ్లకి అందరినీ అందులోకి లాగాలని ఉంటుందంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇక ఎలిమినేషన్స్ లో ఉన్న ముగ్గురిని నిలబెట్టి ఓకే బౌల్ లో లిక్విడ్ పోస్తే ఎలిమినేషన్ నుంచి ఎవరు సేవ్ అయ్యారో వారి పేరు కనిపిస్తుంది అని అన్నారు. దాంతో అమర్ దీప్, శుభ శ్రీ, దామిని తెగ టెన్షన్ పడ్డారు. ఫైనల్ గా అమర్ దీప్ పేరు రావడంతో అతడు ఉపిరి పీల్చుకున్నాడు. అలాగే నేనేంటో చూపిస్తా.. గేమ్ ఇప్పటి నుంచి వేరే రకంగా ఆడతా అంటూ బీరాలు పలికాడు. దానికి నాగ్  నువ్వు రవితేజ ఫ్యాన్ వి గుర్తుపెట్టుకో అంటూ ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూమ్ కు రమ్మని దామిని, శుభ శ్రీ ముందు రెండు బొట్లు ఉంచి ఎవరు ఎలిమినేట్ అయితే వారి బోట్ పేలిపోతుందని తెలిపాడు. పది లెక్కబెట్టేసరికి దామిని ముందున్న బోట్ పేలిపోయింది. దాంతో దామిని ఎలిమినేట్ అయ్యిందని తెలిపాడు నాగ్. దామిని ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లోన్ ఉన్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. హ్యాపీడేస్ సినిమాలోని పాట పాడుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది దామిని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.