Bigg Boss 7 Telugu: “ఎవర్రా వీళ్లంతా.. ఇలా తోలుతున్నారేంట్రా..” వైల్డ్ కార్డు ఎంట్రీల పై శివాజీ జోకులు
నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపారు. త్వరలోనే గౌతమ్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరికొంతమందిని హౌస్ లోకి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఐదు గురు కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. పూజమూర్తి, నయని పావని, మ్యూజిక్ కంపోజర్ భోలే,నటి అశ్విని శ్రీ, అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఒకరు తర్వాత ఒకరు హౌస్ లోకి రావడంతో శివాజీ మైండ్ బ్లాక్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ముందునుంచి చెప్పినట్టే ఈ సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపారు. త్వరలోనే గౌతమ్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరికొంతమందిని హౌస్ లోకి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఐదు గురు కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. పూజమూర్తి, నయని పావని, మ్యూజిక్ కంపోజర్ భోలే,నటి అశ్విని శ్రీ, అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఒకరు తర్వాత ఒకరు హౌస్ లోకి రావడంతో శివాజీ మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లోకి వచ్చిన వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు శివాజీకి.
దాంతో ఎవర్రా మీరంతా అని నవ్వుకున్నారు శివాజీ , తేజ. హౌస్ లోకి వచ్చిన కొత్తవారు ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. సీరియల్ బ్యాచ్ వీళ్లంతా.. దాంతో శివాజీ ఎవర్రా వీళ్లంతా అని నవ్వుకున్నారు. తేజ అయితే కిందపడి మరి నవ్వాడు.
శివాజీ , తేజగా గార్డెన్ ఏరియాలో కూర్చొని ” రేయ్ తేజ నేను ఎప్పుడూ ఏడ్వలేదురా.. హౌస్ని లోకి వచ్చిన వాళ్ళను చూస్తే ఏడ్వాలనిపిస్తుందిరా.. వీళ్లేనా ఇంకెవరైనా ఉన్నారా.? కాదురా తేజా.. ఎవర్రా వీళ్లంతా.. అసలు ఎవుర్రా మీరంతా.. అరే ఎవుర్రా వీళ్లంతా.. వీళ్లని ఇలా హౌస్‌లోకి తోలుతున్నారేంట్రా..” అంటూ తెగ నవ్వుకున్నారు తేజ, శివాజీ. ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. అలాగే గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. దాంతో హౌస్ లో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ రోజు నుంచి నామేషన్స్ మొదలు కానున్నాయి. చూడాలి మరి వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారో .
బిగ్ బాస్ సీజన్ 7 ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..