Bigg Boss 7 Telugu: మాస్టర్ ప్లాన్ వేసిన ప్రియాంక, శోభా.. దెబ్బకు దండం పెట్టిన ప్రిన్స్

ఇక ఇప్పటికే రెండు పవర్ అస్త్రలు హౌస్ లో ఉన్నవారికి ఇచ్చారు. ఆట సందీప్ కు మొదటి పవర్ అస్త్ర సాధించగా శివాజీ రెండో పవర్ అస్త్రను సాధించారు. ఇక ఇప్పుడు మూడో పవర్ అస్త్ర ను సాధించే కంటెండర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడో పవర్ అస్త్ర సాదించిందనికి ముగ్గురు మెంబర్స్ పోటీపడుతున్నారు. ప్రిన్స్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఈ ముగ్గురిలో ఒకరు మూడో పవర్ అస్త్రను పొందనున్నారు.

Bigg Boss 7 Telugu: మాస్టర్ ప్లాన్ వేసిన ప్రియాంక, శోభా.. దెబ్బకు దండం పెట్టిన ప్రిన్స్
Bigg Boss 7

Updated on: Sep 22, 2023 | 10:18 AM

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం కూడా పూర్తి చేసుకోనుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు రానున్నారు , వైల్డ్ కార్డు తో ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే రెండు పవర్ అస్త్రలు హౌస్ లో ఉన్నవారికి ఇచ్చారు. ఆట సందీప్ కు మొదటి పవర్ అస్త్ర సాధించగా శివాజీ రెండో పవర్ అస్త్రను సాధించారు. ఇక ఇప్పుడు మూడో పవర్ అస్త్ర ను సాధించే కంటెండర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడో పవర్ అస్త్ర సాదించిందనికి ముగ్గురు మెంబర్స్ పోటీపడుతున్నారు. ప్రిన్స్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఈ ముగ్గురిలో ఒకరు మూడో పవర్ అస్త్రను పొందనున్నారు. అయితే తాజాగా వీరికి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. నేటి ఎపిసోడ్ కు సంబంధించిన పీఎంఓను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో యావర్ శోభా, ప్రియాంకతో గొడవ పెట్టుకోవడం చూపించారు.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం కంటెండర్స్ గా ఉన్న ముగ్గురని నిలబెట్టి వారి ముందు వారి బొమ్మలను ఉంచి  మూడో పవర్ అస్త్రకు ఎవరు అనర్హులో వారి బొమ్మను సుత్తితో కొట్టాలని చెప్పాడు బిగ్ బాస్ దాంతో ఈ ముగ్గురు ముందుగా వాదించుకున్నారు. అందులో ప్రిన్స్ శోభా మధ్యలో వాదన జరిగింది. శోభా పిన్స్ బొమ్మను పగల గొట్టాలని నిర్ణయించుకుంటుంది. ముగ్గురిలో నువ్వే టాప్ కంటెస్టెంట్ వి అని చెప్పడంతో ప్రిన్స్ కు మండింది. నువ్వు కేవలం అమ్మాయితోనే పోటీపడతావా అంటూ అరుస్తూ బిగ్ బాస్ కు చెప్తూ రచ్చ చేశాడు.

ఆతర్వాత ప్రియాంక కు దండం పెడుతూ ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నాడు. కానీ ప్రియాంకా కూడా తెలివిగా యావర్ అబ్బాయి పైగా ఫిజికల్ గా స్ట్రాంగ్ గాఉన్నాడు కాబట్టు అతడి బొమ్మని పగల గొట్టాలనుకుంటుంది. దాంతో ప్రిన్స్ మరింత రెచ్చిపోయి ఆమె పై కూడా చిందులేశాడు. ప్రియాంకా కూడా అరువు ఎంత పెద్దగా అరుస్తావో అరువు అంటూ సీరియస్ అయ్యింది. ఇక సంచలక్ గా ఉన్న సందీప్ అక్కడికి వచ్చి యావర్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు తన బొమ్మను తానే పగల గొట్టుకున్నాడు ప్రిన్స్. ఇదంతా ప్రోమోలో చూపించారు. ప్రోమోలో చూపించింది తక్కువే ఈ రోజు ఎపిసోడ్ మంచి గరం గరంగా ఉంటుందని అర్ధమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.