Bigg Boss 7 Telugu: రేయ్ వెధవా.. వెధవన్నార వెధవ.. అమర్ పై రెచ్చిపోయిన శివాజీ

|

Dec 16, 2023 | 7:35 AM

మరోసారి అమర్ దీప్ తన స్టైల్ లో నవ్వులు పూయించాడు.  తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు అమర్ దీప్. ప్రశాంత్ జాతకం చెప్తూ.. ప్రశాంత్‌ది చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ మాటలు వాడాడు ఏంటి పెద్దది అని ప్రశాంత్ అంటే.. అంత పెద్దదా.? అని శివాజీ కౌంటర్ వేశాడు. ఆతర్వాత అర్జున్ జాతకం చెప్పాడు. అయితే నాకు జాతకం సరిగా చెప్పకపోతే నీ జాతకం బయటపడిపోతుంది అని అర్జున్ బెదిరించాడు, అనంగనగా ఓ కారు అంటూ ఓ స్టోరీ హింట్ ఇచ్చాడు అర్జున్.

Bigg Boss 7 Telugu: రేయ్ వెధవా.. వెధవన్నార వెధవ.. అమర్ పై రెచ్చిపోయిన శివాజీ
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ లు ఇస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్ ను జ్యోతిష్యుడిగా హౌస్ లో ఉన్న వారి జాతకాలు చెప్పమని అన్నాడు బిగ్ బాస్. మరోసారి అమర్ దీప్ తన స్టైల్ లో నవ్వులు పూయించాడు.  తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు అమర్ దీప్. ప్రశాంత్ జాతకం చెప్తూ.. ప్రశాంత్‌ది చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ మాటలు వాడాడు ఏంటి పెద్దది అని ప్రశాంత్ అంటే.. అంత పెద్దదా.? అని శివాజీ కౌంటర్ వేశాడు. ఆతర్వాత అర్జున్ జాతకం చెప్పాడు. అయితే నాకు జాతకం సరిగా చెప్పకపోతే నీ జాతకం బయటపడిపోతుంది అని అర్జున్ బెదిరించాడు, అనంగనగా ఓ కారు అంటూ ఓ స్టోరీ హింట్ ఇచ్చాడు అర్జున్. దాంతో అమర్ దీప్ కంగారుపడ్డాడు. ఈయన అందర్నీ ఎంకరేజ్ చేస్తారు.. ఒక్కర్ని తప్ప అని అర్జున్ గురించి అమర్ అంటే.. ‘వెధవల్ని ఎంకరేజ్ చేయరు కదండీ’ అంటూ మరో కౌంటర్ ఇచ్చాడు శివాజీ.

ఇండైరెక్ట్ గా అమర్ దీప్ ను ఎదవ అని అన్నాడు. నా జీవితం మొత్తంలో ఓ వెధవ.. ఐదేళ్ల నుంచి నా వెనుక తిరుగుతున్నాడు అని అర్జున్ అంటే.. ఆ వెధవ గురించేలే చెప్తున్నదీ అని శివాజీ అన్నాడు. ఆతర్వాత శివాజి జాతకం చెప్పాడు అమర్ ‘అన్నా మీ జాతకం చెప్తాను దయచేసి కోప్పడకండి’ అని ముందే అన్నాడు. దానికి పగిలిపోద్దిరోయ్ అన్నాడు శివాజీ.

‘పల్లవి ప్రశాంత్, యావర్‌లకే అన్నీ ఇస్తారు.. మీ గొంతు చూసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడరు. మీకు కాఫీ అంటే ఎక్కువ ఇష్టం… మీకు పంచే గుణం ఎక్కువ.. అందరికీ పంచుతున్నారు.. పది మందికి మీరు చేసే మంచి మీకెప్పుడూ తోడు ఉంటుంది. అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్.

‘ఇప్పుడు నేను ఓ వెధవ జాతకం చెప్పాలని అనుకుంటున్నాను’ అని అన్నాడు శివాజీ. వెంటనే శివాజీ అమర్ దీప్ జాతకం చెప్పాలని లెటర్ పంపించాడు బిగ్ బాస్. ఈ వెధవ గురించి చెప్పాలని మా నోరు ఉవ్విళ్లూరుతోంది.. రేయ్ నేను నీ చేతులు చూడాల్సిన అవసరం లేదు నీ ఫేస్ చూస్తే చాలు.. సహజంగా నిన్ను చూడగానే ఎవడీ వెధవ అని మనసులో వస్తుంది జనానికి. నువ్వు మామాలూ వెధవ్వి కాదు.. వెధవన్నార వెధవ్వి అంటూ రెచ్చిపోయాడు శివాజీ. ఈ వెధవ జాతకం మొత్తం బయటపెడతా.. మనిషి మంచోడే గుణమే గుడిసేటిది అన్నాడు శివాజీ. అడ్డదారులు ఎక్కువ.. ఆ అడ్డదారుల వల్ల కప్పుకి దగ్గర కావాల్సినోడివి.. కప్పుకి అరకిలో మీటర్ దూరంలో ఉన్నావ్. కప్పు కోసం పోరాడుతున్న క్రమంలో నీకు దరిద్రమైన ఆలోచన కూడా ఉంది. వాళ్లు ఇవ్వకుండానే తీసుకుని పోదాం అనే ఆలోచన కూడా ఉంది.. రేయ్ వెధవా.. వెధవన్నార వెధవ ఇటు చూడరా.. అంటూ అమర్ ను నవ్వుతూనే వెధవను చేశాడు. అమర్ మాత్రం అన్నవుతూ ఆ మాటలను ఫన్నీగా తీసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.