Arun Tehelka: బిగ్‏బాస్ ఫైనలిస్ట్ అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీపై నెటిజన్స్ ఫైర్.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్.. ఎందుకంటే..

ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే 5వ స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చాడు అరుణ్. ఇదిలా ఉంటే.. ఈ ఆదివారం అరుణ్ మాషెట్టి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అతడికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు అతడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చార్మినార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణ్ మాషెట్టిని కలిసేందుకు దారి పొడవునా ఎంతో మంది అభిమానులు నిలబడ్డారు.

Arun Tehelka: బిగ్‏బాస్ ఫైనలిస్ట్ అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీపై నెటిజన్స్ ఫైర్.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్.. ఎందుకంటే..
Arun Mashetty

Updated on: Feb 06, 2024 | 2:33 PM

బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉండే రెస్పాన్స్ గురించి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఈ షో సక్సెస్‏ఫుల్‏గా రన్ అవుతుంది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. హిందీలో ఇప్పటివరకు 17 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. కానీ మొదటిసారి బిగ్‏బాస్ హిందీ షోలో హైదరాబాద్ కుర్రాడు అడుగుపెట్టాడు. అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీ.. యూట్యూబర్. అదే పాపులారిటీతో బిగ్‏బాస్ షోకు అడుగుపెట్టి తన ఆట తీరుతో ఫైనలిస్ట్ అయ్యాడు. ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే 5వ స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చాడు అరుణ్. ఇదిలా ఉంటే.. ఈ ఆదివారం అరుణ్ మాషెట్టి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అతడికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు అతడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చార్మినార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణ్ మాషెట్టిని కలిసేందుకు దారి పొడవునా ఎంతో మంది అభిమానులు నిలబడ్డారు.

ఆదివారం హైదరాబాద్‌లోని కులీ కుతుబ్ షా స్టేడియంలో అరుణ్ మాషెట్టి కోసం అభిమానుల సమావేశం జరిగింది. అయితే ఈ క్రమంలోనే వారు జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు వస్తున్నాయి. విమానాశ్రయం నుంచి చార్మినార్ వరకు జరిగిన ర్యాలీలో అరుణ్ మాషెట్టి మెర్సిడెస్ కారులో నిలబడి అభిమానులను పలకరించాడు. అయితే అదే వాహనం బానెట్ పై జాతీయ జెండాను చిత్రించి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలయ్యాయి. అయితే కొందరు వ్యక్తులు కారు రూఫ్ పైకి ఎక్కి బానెట్ పైకి ఎక్కి త్రివర్ణ పతకాన్ని అగౌరవపరిచారని విమర్శలు వస్తున్నాయి. అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీ, తెహల్కా భాయ్, సమర్థ్ జురెల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈవెంట్ సమయంలో జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు ఈ ముగ్గురు క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అరుణ్ మాషెట్టికి.. అతడి స్నేహితులకు మద్దతు తెలుపుతున్నారు. వారంత జాతీయ జెండాకు దూరంగానే నిలబడి ఉన్నారని.. వారు జెండా దగ్గర నిలబడలేదని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కావాలని అరుణ్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. స్పష్టత కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.