డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ క్రమంలోనే భోళా శంకర్ చిత్రయూనిట్ పై .. ముఖ్యంగా డైరెక్టర్ మెహర్ రమేష్ పై ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. అదే సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి పట్టుబట్టడంతో నిర్మాత అనిల్ సుంకర ఇల్లు, తోటలను అమ్మాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పటికే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. అయినప్పటికీ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా ఈ రూమర్స్ ను ఖండించారు.
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ కొంతమందికి ఆనందాన్ని ఇవ్వచ్చు.. కానీ ప్రతిక్షణం కష్టపడి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం నిజంగా నేరమని అన్నారు అనిల్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశారు. “సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రూమర్స్.. కొంతమందికి క్రూరమైన వినోదాన్ని ఇవ్వచ్చు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం సరైనది కాదు. ఇలాటి వార్తల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తాయి. నాకు చిరంజీవి గారికి మధ్య వివాదం నెలకొందని వస్తోన్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. ఆయన మాకు అన్ని విధాల సహకారం అందించే వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ మా మధ్య మంచి స్నేహం ఉంది. నిజాలు కాకుండా.. విద్వేషపూరిత వార్తలను ప్రచారం చేయకుండి. రూమర్స్ వల్ల చాలా మందికి ఇబ్బంి కలుగుతుంది. ఈ విషయంలో నా శ్రేయస్సు కోరిన ఇండస్ట్రీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ” అంటూ ట్వీట్ చేశారు.
అనిల్ సుంకర ట్వీట్..
Rumors may satisfy the cruel fun of some people, but tarnishing the image built on hardwork for ages is an unacceptable crime. It also gives immense pressure and anxiety to all the families involved. The news spread about the dispute between me and chiranjeevi garu is pure trash.…
— Anil Sunkara (@AnilSunkara1) August 17, 2023
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరంజీవి. ఈ సినిమాలోనే మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు నెక్ట్స్ నటించిన భోళా శంకర్ పై భారీ అంచనాలు ఉండగా.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చిరు.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
#TeenuMaaru Song
is out now ❤️🔥– https://t.co/tokZZv5ksC@SagarMahati Thumping Musical
A film by @MeherRamesh@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @AKentsofficial @dudlyraj @LyricsShyam @Sekharmasteroff @BholaaShankar @adityamusic… pic.twitter.com/BJiQOUTznV
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2023
మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టా ట్వీట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.