
ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఆ నటి గుర్తుందా? ఆమె వెండితెరపై కనిపించి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. 50 ఏళ్లు దాటిన వారు సాధారణంగా మోకాళ్ల నొప్పులు, నీరసం అంటూ ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈమె మాత్రం 55 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా వర్కౌట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫిట్నెస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాయామం చేయడానికి మీరు జిమ్‌కు వెళ్లక్కర్లేదు, ఖరీదైన పరికరాలు కూడా అవసరం లేదు. ఇంతకీ ఆ ‘ఎవర్గ్రీన్ బ్యూటీ’ ఎవరో, ఆమె చెప్పే ఆ ఫిట్నెస్ మంత్రం ఏంటో తెలుసుకుందాం..
సాధారణంగా ఫిట్‌గా ఉండాలంటే కార్డియో వ్యాయామాలు వేరుగా, బరువులు ఎత్తే స్ట్రెంత్ ట్రైనింగ్ వేరుగా చేయాలని అనుకుంటారు. కానీ ఈ నటి మాత్రం రెండింటినీ కలిపి చేసే ఒక సింపుల్ వర్కౌట్‌ను పరిచయం చేసింది. మౌంటైన్ క్లైంబర్స్ అంటే నేలపై చేతులు ఉంచి, పరిగెడుతున్నట్లుగా కాళ్లను మార్చి మార్చి కదిలించే ఈ వ్యాయామం వల్ల గుండె వేగం పెరుగుతుంది. అదే సమయంలో చేతులు, పొత్తికడుపు కండరాలు దృఢంగా మారుతాయి. ఈ వర్కౌట్ కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఇంట్లో లేదా ఆఫీసులో కొంచెం ఖాళీ సమయం దొరికినా దీనిని ప్రాక్టీస్ చేయవచ్చని ఆమె సూచిస్తోంది.
Bhagya Sree
కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతత కోసం ఆమె నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల సాంద్రత తగ్గిపోతుంటుందని, అందుకే ప్రతిరోజూ ఇలాంటి చిన్నపాటి కసరత్తులు చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని ఆమె తన అభిమానులకు వివరిస్తోంది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, రోజూ కనీసం 15 నిమిషాలు కేటాయిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆమె పేర్కొంది.
తన అద్భుతమైన చిరునవ్వుతో, ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటున్న ఆ నటి మరెవరో కాదు.. ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ! అవును, రాధేశ్యామ్ వంటి సినిమాలతో తెలుగులోనూ సందడి చేసిన ఈమె, ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండటం నిజంగా గ్రేట్. సోషల్ మీడియా వేదికగా ఆమె తరచుగా తన హెల్త్ టిప్స్‌ని షేర్ చేస్తూ ఫాలోవర్లకు స్ఫూర్తినిస్తోంది.
“వయసు అనేది కేవలం అంకె మాత్రమే.. ఆరోగ్యం అనేది మనం ఇచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది” అని భాగ్యశ్రీ మరోసారి నిరూపించింది. జిమ్‌కు వెళ్లే సమయం లేదని సాకులు చెప్పకుండా, భాగ్యశ్రీ చెప్పినట్లు ఇంట్లోనే ఇలాంటి చిన్నపాటి వ్యాయామాలు మొదలుపెట్టి చూడండి.